
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -డిసెంబర్ 28:డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఎస్. యానాం బీచ్ శుక్రవారం నుంచి జాతీయ మహిళల బీచ్ వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి.

బీచ్ వాలీబాల్ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు రెండో రోజు ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎంతో క్రమశిక్షణతో 27,28,29 తేదీ లో సాయంత్రం కొనసాగుతున్న,ఈ ఆటలు పోటీలను తిలకించాలని ఆయన కోరారు. యానం బీచ్ ను మన రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలలో మొదటి స్థానం పొందే విధంగా అభివృద్ధి చెందిందని శాసనసభ్యులు ఆనందరావు పేర్కొన్నారు.పోటీల నిర్వహణలో ఎటువంటి లోటి పాటులు జరగకుండా ఏర్పాట్లు చేపట్టాలన్ని నిర్వాహకులకు ఆయన సూచించారు.