
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జులై 18 :
సేవ్ ది పీపుల్ ట్రస్ట్ సమాజ శ్రేయస్సును కోరి మానవతా దృక్పథంతో చేస్తున్న సేవలు అభినందనీయమని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవిన్యూ అధికారి బి ఎల్ ఎన్ కుమారి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని జిల్లా రెవెన్యూ అధికారి చాoబర్ నందు డిఆర్ఓ రాజకుమారి చేతుల మీదు గా 20 వేలు చెక్కును విద్యార్థి తల్లికి అందజే శారు.ఈ సందర్భంగా డిఆర్ఓ రాజకుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో పేదరికం చదువుకు అడ్డు కారాదని మానవతా దృక్పథం దాతృత్వంతో సేవ్ ది పీపుల్ ట్రస్ట్ సమాజంలో ప్రతిభ గల పేద విద్యార్థులను గుర్తించి అంది స్తున్న ఆర్థిక సహాయ సేవలు అభినందనీయమన్నారు. ఏడోవ తరగతి విద్యను నభ్యసిస్తున్న గెద్దాడ భారత్ కుమార్, తొమ్మిదవ తరగతి చదువుతున్న మానస విద్యార్థులకు సేవ్ ది పీపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 20 వేల రూపాయలు ఫీజు నిమిత్తం చెక్కును అందించడం జరిగిందన్నారు. రాజోలు గౌతమ్ మోడల్ స్కూల్లో చదువుతున్న మానస, భరత్ తల్లీ గంగా భవాని లకు చెక్కులను డిఆర్ఓ చేతుల మీదుగా అందిం చారు. విద్యార్థి తండ్రి కరోనాతో మరణించడంతో కుటుంబం ఆర్థికంగా చితికిపోయిందని ట్రస్ట్ సభ్యులు గుర్తించి పిల్లలకు చదువు నిమిత్తం ట్రస్ట్ సహ కారంతో ఆర్థిక సహాయం అందించారన్నారు. సేవ్ ది పీపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 36 మంది పేద విద్యార్థులను భవిష్య త్తును తీర్చిదిద్దాలని సంకల్పంతో సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమ న్నారు. సమాజ హితాన్ని కోరే ఇలాంటి స్వచ్ఛంద సంస్థలకు సమాజంలో మరింతగా ముందుకు వచ్చి మానవతా దృక్పథంతో పేద పిల్లల భవితకు తోడ్పాటు నందించాలని ఆమె ఆకాం క్షించారు. అనంతరం సేవ్ ది పీపుల్ ట్రస్ట్ అధ్యక్షుడు సుంకర సుధీర్ మాట్లాడుతూ విద్యార్థుల పేద కుటుంబాల ఆర్థిక పరిస్థి తులను క్షేత్ర స్థాయిలో అధ్యయనం తర్వాత సంస్థ సేవా దృక్పథంతో 20 వేల రూపాయల చెక్కును పాఠశాల యొక్క ఫీజు నిమిత్తం అందిం చడం జరిగిందన్నారు. ఈ కార్యక్ర మంలో ట్రస్ట్ సభ్యులు మానస సుప్రియ , నవ్య, నాగ దుర్గా, రాజు పాల్గొన్నారు.