

తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం అక్టోబర్ 21:

సురక్షిత సమాజ నిర్మాణం లో పోలీసులు పాత్ర ఎంతో ముఖ్యమని రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ అన్నారు.

రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి పోలీసు వ్యవస్థ చాలా అవసరం, ఎందుకంటే ఇది చట్టాన్ని అమలు చేయడంలో, ప్రజల జీవితాలు, ఆస్తి మరియు హక్కులను రక్షించడంలో, ప్రజా శాంతిభద్రతలను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అని అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు.
విది నిర్వహణలో అమరులైన పోలీసులు అమరవీరులకు నా జోహార్లు అన్నారు. భౌతికంగా మరణించిన సమాజంలో స్వచ్ఛముగా నిలిచి ఉన్నారని ఎమ్మెల్యే ఆనందరావు ఈ సందర్భంగా పోలీసు సేవలను కొనియాడారు.

మంగళవారం స్థానిక అమలాపురం పోలీస్ అమర వీరుల స్థూపం వద్ద అమర వీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వ హించారు. తొలుత ప్రజా ప్రతినిధులు పోలీసు ఉన్న తాధికారులు అమర వీరుల స్తూపం వద్ద పుష్ప చక్రాలు ఉంచి ఘనంగా నివాళుల ర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసు అమరవీరు ల సంస్మరణ దినోత్సవం పోలీసు బలగాల ధైర్యం, కర్తవ్యనిష్ఠ, త్యాగాన్ని వీరోచిత పోరాటాలను స్మరించుకుంటూ దేశ భద్రతకు అంకితభావాన్ని గుర్తుచేస్తుందన్నారు.దేశ భద్రత, ప్రజా శాంతి కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు సిబ్బందిని దేశ వ్యాప్తంగా స్మరించుకుంటారన్నారు. పోలీసు సేవలను గౌరవించే రోజుగా, సివిల్ సొసైటీ భద్రతా వ్యవస్థల మధ్య పరస్పర గౌరవాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహ ణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీస్ సిబ్బంది యొక్క త్యాగాలను, శౌర్యాన్ని స్మరించుకుo
టూ గౌరవ వందనం సమ ర్పించారు.

వారి అపారమైన ధైర్యం దేశభక్తికి చిహ్నంగా ఈ దినోత్స వాన్ని ప్రకటించారన్నారు జిల్లా స్థాయిలో పోలీస్ బలగాలు అమరులకు నివాళులు అర్పిస్తూ ప్రత్యేక పరేడ్‌లు, సంస్మరణ కార్యక్ర మాలు నిర్వహించడం జరి గింద న్నారు.అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం, పోలీసు శాఖ అండగా నిలబడి వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటా మన్నారు అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న సేవలు, కష్టాలు నిరంతరకృషి శ్లాఘ నీయమన్నారు.

ఈ దినోత్స వ విశిష్టతను ప్రజలకు తెలియజేయడమే ప్రధాన ఉద్దేశ్యమన్నారు దేశ సేవ లో ప్రాణాలు అర్పించిన పోలీసు సిబ్బందిని స్మరిం చుకుని దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీ సులకు శ్రద్ధాంజలి ఘటిం చార న్నారు.1959లో లద్దాఖ్ లోని హాట్స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా సైన్యం చేతిలో 10 మంది భారత సాయుధ పోలీసులు వీరమరణం పొందిన నాటినుండి ఈ సంస్మరణ దినోత్సవం ప్రాముఖ్యత సంతరించుకుoదన్నారు.

పోలీసు శాఖలో సేవలంది స్తున్న వారికి ప్రోత్సాహం, గౌరవం కల్పించేందుకు ఇదొక అవకాశమన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డి పోరాడిన పోలీ స్ అమరుల సేవలను జాతి ఎన్నటికీ మరువదని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు.దేశం కోసమే ఈ దేహ మని ప్రజల కోసమే మా ప్రాణమంటూ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీ రులకు శ్రద్ధాంజలి ఘటించారు.

దేశ ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ కోసం శాంతి భద్రతల పరిరక్షణలో అసాంఘిక శక్తులతో ప్రతి దినం ధైర్యంగా పోరాడు తూ తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన పోలీసు సిబ్బందికి నివాళు లర్పించేందుకు అక్టోబర్ 21వ తేదీని పోలీస్ అమర వీరుల సంస్మరణ దినంగా జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగు తోందన్నారు పోలీసు సేవలో అత్యున్నత త్యాగం చేసిన వీర జవాన్లను స్మరించుకునే రోజు మాత్ర మే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడటానికి వారు చూపిన సేవాభా వానికి చిహ్నమన్నారు.

అమరు లత్యాగాన్ని స్మరిం చుకునే సూచకంగా అమరవీ రుల సంస్మరణ దినంగా పాటించడం జరుగుతోంద న్నారు.నేడు ఆరంభమైన సంస్క రణ కార్యక్రమాలు జాతీయ ఐక్యతా దినోత్సవం అనగా ఈనెల 31 తో ముగుస్తాయ న్నారు.దేశ భద్రత కోసం వారు చేసిన త్యాగాల గురించి సమాజంలో అవ గాహన కల్పించేందుకు అమర వీరుల స్మారకార్థం పోలీసు సిబ్బంది వారం రోజులపాటు కార్యక్రమా లను చేపడతా రన్నారు.

విధి నిర్వహణలో వీరమరణం పొందిన అమలాపురం ఎస్సై అశోక్ కుటుంబానికి కానిస్టేబుల్ బ్లెసన్ జీవన్ కుటుంబ సభ్యులకు జ్ఞాపికల తో పాటుగా ఆర్థిక సహాయాన్ని పోలీసు శాఖ తరపున అతిధులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. తొలుత జిల్లా ఎస్పీ రాహుల్ మీనా జిల్లావ్యాప్తంగాపోలీస్ శాఖ లో విధినిర్వహణలో అమరులైన వారి కుటుంబాల సంక్షేమ నిమిత్తం చేపడుతున్న సహాయ కార్యక్రమాలు వారి కుటుంబాలను ఆదుకునే విధివి ధానాలపై విశదీకరించారు ఈ కార్యక్రమంలో, శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్ , డీఎస్పీలు పోలీస్ సిబ్బంది పాల్గొ న్నారు.
