V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం డిసెంబర్ 15: భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి నాంది పలికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కై ఆమరణ నిరాహార దీక్ష నిర్వహించి ప్రాణత్యాగం, అత్మార్పణ చేసిన అమర జీవిగా పొట్టి శ్రీరాములు కీర్తించబడ్డారని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలి పారు. ఆదివారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కలెక్టరేట్ నందు అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగాన్ని స్మరించుకుంటూ ఆత్మార్పణ మరియు వర్ధంతిని పురస్కరించుకుని ఆయ న చిత్రపటానికి పూలమాలలు అలంకరించి పుష్ప గుచ్చాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పితామ హుడు అమరజీవి పొట్టి శ్రీరాములన్నారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మహనీయుడ న్నారు ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహారదీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థా పక పితామహుడు గా పేరు గాంచారన్నారు సా మాజిక న్యాయం, దళితుల అభ్యున్నతి కోసం నిబద్ధత కోసం మతపరమైన ప్రదేశాల ప్రాప్యత కోసం వాదించ డాని కి నిరాహార దీక్షలు నిర్వహిం చారన్నారు. మహాత్మా గాంధీ ప్రభావంతో శ్రీరాములు ఉప్పు సత్యా గ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంతో సహా ప్రధాన స్వాతంత్ర్య ఉద్యమాలలో పాల్గొని అనేకసార్లు జైలు శిక్ష అనుభవించారన్నారు. తెలు గు మాట్లాడే ప్రజ లందరికీ ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయా లన్న ఉద్దేశంతో పొట్టి శ్రీరా ములు అమరణ దీక్ష చేశా రన్నారు. భాషా ప్రాతిపదిక పైన ఏర్పడిన మొట్ట మొదటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రమ న్నారు. పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగం వల్ల ఏర్పడిన భాషా ప్రయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా 1956 నవంబరు 1 న ఏర్పాటైందన్నారు. జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ టీవీ ప్రసాద్ మాట్లాడుతూ 1952 లో మద్రాసు ప్రెసిడెన్సీ నుండి తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ శ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాహా ర దీక్ష చేసి ఆత్మార్పణ చేసు కున్నారన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని, తెలుగు జాతి ఔనత్యాన్ని కాపాడిన త్యాగమూర్తి అన్నారు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ప్రాణాలొదిలిన వీరుడన్నారు. పొట్టి శ్రీరాములు సిసలైన గాంధేయవాదనీ గాంధీజీ వలె నిస్వార్థ దేశభక్తుడు, నిరాడం బరుడు త్యాగశీలి, కార్యదీక్షా పరుడనీ. తన ఆశయ సిద్ధికి ప్రాణాలు సహితం లెక్కచే యని దీశాలన్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రాణాలు అర్పించి అమరజీవిగా నిలిచారన్నా రు.1912 లోనే ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమాలు మొదలయ్యాయని. అదే సమయంలో స్వాతంత్ర ఉద్యమం జరుగుతోందనీ. గాంధీజీ ప్రభావం శ్రీరాము లుపై చాలా ఎక్కువగా ఉండే దని ఆయన గాంధీజీ అను చరుడుగా సబర్మతి ఆశ్రమం లో చేరారన్నారు. ఆయన దీక్ష పట్టుదల చూసిన గాంధీ శ్రీ రాములు లాంటి వారు పది మంది ఉంటే నేను సంవత్స రంలోనే భారత దేశానికి స్వాతంత్య్రాన్ని సాధిస్తానని ప్రకటించారన్నారు. ఈ కార్య క్రమంలో వికాస జిల్లా మేనేజ ర్ జి రమేష్ , కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ మురళీ కృష్ణ సిబ్బంది రవికిరణ్, భరత్, వెనుకబడిన తరగతుల వసతి గృహ సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అమర జీవిగా పొట్టి శ్రీరాములు: కలెక్టర్ మహేష్ కుమార్
December 15, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.కుట్టు శిక్షణా కేంద్రాలు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 08: రాష్ట్ర ప్రభుత్వం మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా […]
DSC 2025 పరీక్షలు- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –అమలాపురం,జూన్ 08,2025 DSC 2025 పరీక్షలు- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జూన్ 8 వ […]
పరిటాల రవి నిందితుల విడుదల
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- కడప డిసెంబర్ 20: కడప జిల్లాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దివంగత నేత పరిటాల రవి హత్య కేసులో నిందితులు జైలు నుంచి […]
అమలాపురం కలెక్టరేట్లో ఉద్యోగులకు కంటి వైద్య శిబిరం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఫిబ్రవరి 22: సర్వేంద్రియానాo నయనం ప్రధానమని, అన్ని ఇంద్రి యాలలో కళ్ళు ప్రధానమై నవని కంటి ప్రాముఖ్యత ను గుర్తెరిగి ఎప్పటికప్పుడు వైద్య […]