


V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 21:

శ్వాసపై ధ్యాసతో సుసం పన్న ఆరోగ్యాన్ని బాటలు వేసే యోగా ఔన్నత్యాన్ని ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికీ చేరువచేసే ఉద్దేశం తో ముఖ్య మంత్రి మార్గనిర్దేశనంతో రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు యోగాంధ్ర కార్య క్రమాలను విజయవం తంగా నిర్వహించారని స్థానిక పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ పేర్కొన్నారు.

శనివారం 11వ అంత ర్జాతీయ యోగ దినోత్స వం వేడుకలలో భాగంగా ఆయన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ కళాశాల నందు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కామన్ ప్రోటోకాల్ యో గాసనా లు వేసే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వర్షం పడి ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ అధికారులు ప్రజలు 5వేల మంది పాల్గొని నిల బడి యోగాసనాలు వేస్తూ ప్రక్రియను విజ యవంతం చేయడం ఎంతో గర్వకారణమన్నారు.

రోజువారీగా ఒక్కొక్క ఇతివృత్తం తో యోగా కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా దిగ్విజ యంగా నిర్వహించార న్నారు. యావత్ ప్రపం చానికే యోగా నేర్పిన విశ్వ గురువు భారతదేశ మన్నారు మానవాళికి మానసిక శారీరక సౌభా గ్యాన్ని ప్రసాదించే శక్తివం తమైన దివ్య ఔషధం యోగా అన్నారు.

రోజు వారి ఇతివృత్తాలతో రైతులు, కార్మికులు, ఉపాధి హామీ శ్రామికులు, సీనియర్ సిటిజన్స్ ఇలా సమాజంలోని ప్రతివర్గానికి యోగాను ఈ థీమ్ యోగాను నిర్వహిం చినట్లు తెలిపారు వాడపల్లి, దాక్షారామం, అంతర్వేది దేవాలయాలలోని అంతర్వేది బీచ్ ప్రాం తాల్లోనూ యోగా విశిష్టతను వివరించి యోగా ప్రయోజనాలపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించడం జరిగిందని, ప్రజలు తమ జీవనశైలిలో యోగాను భాగం చేసు కొని జీవితాంతం అభ్య సించేలా కృషి జరిగిందన్నారు.

జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లా డుతూ భారతీయ వారసత్వ సంపద అయిన యోగాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ విభాగం ద్వారా నెలరోజులపాటు చైతన్య కార్యక్రమాలు ప్రజలు ఆచరించేలా వివిధ రకాలుగా నిర్వహించిందన్నారు యోగాభ్యసనతో శారీరక, మానసిక ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం తో పాటు అభ్యసన వేయించడం జరిగిందన్నారు.

నిపుణులు రూపొం దించిన 45 నిమిషాల నిడివి తో ఉన్న కామన్ యోగా ప్రోటోకాల్ ఆధారంగా యోగాస నాలునేర్పించడం జరిగిందన్నారు యోగాను ప్రతి వర్గానికి చేరువచేయ డంలో సమష్టి భాగస్వామ్యం తో అందరం కలిసి యో గాంధ్రను విజయవంతం చేశారన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిషాoతి ప్రసంగిస్తూ యోగా డేను ఒక్క రోజుకే పరిమితం చేయకుండా యోగా గొప్పతనాన్ని ప్రజలందరికీ వివరించి అన్ని వర్గాల ప్రజలు జీవితంలో యోగా అంతర్భా గం చేసుకోవాలన్నారు.

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించే దిశగా ఈ ఏడాది ఏపీలో యోగా డే ను నిర్వహించా లన్న ప్రధాని ఆకాంక్షల మేరకు విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఐదు లక్షల మందితో కార్యక్ర మాన్ని నిర్వహించుకోవడం జరిగిందన్నారు. యోగా ను ప్రతి ఒక్కరూ జీవనశైలిలో భాగం చేసుకోవాలని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరో గ్యాన్ని మెరుగుపరు చుకునేలా జూన్ 21 తర్వాత 9వ తరగతి చదువుతున్న పిల్లలకి పాఠ్యాంశాల్లో యోగాను అంతర్భాగం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. యోగా ద్వారా మానసిక, శారీరక ఆనందం కలుగు తుందన్నారు.

ఆరోగ్యంగా జీవించడంలో కంటే మించిన సంపద లేదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల న్నారు. సాంస్కృతిక వారస త్వ సంపద అయిన యోగ సాధనను ప్రపంచానికి చాటి చెప్పడంలో గౌరవ ప్రధాని సఫలీకృతులు అయ్యార న్నారు శరీరం లో ఉన్న అన్ని వ్యవ స్థలకు నూతన ఉత్తేజా న్ని ఇచ్చే శక్తి యోగాసనాలకు ఉందని ఒత్తిడి లేని జీవితంలో అడుగుపెట్ట నివ్వకుండా యోగాసనాలు రక్షణ కవచల్లాగా పనిచేస్తాయన్నారు.

తొలుత యోగాసనాలు వేయించి యోగ సంకల్ప ప్రతిజ్ఞ చేయిం చారు. యోగా మాస ఉత్స వాలు దిగ్విజయంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ధన్యవాదాలు తెలి పారు.ఈ కార్యక్రమంలో చైతన్య వైద్య కళాశాల ఫౌండర్ చైతన్య రాజు, మెట్ల రమణబాబు డిఆర్ఓ రాజకుమారి ఏవో కాశీ విశ్వేశ్వరరావు, డి ఎం అండ్ హెచ్ ఓ దుర్గారావు ద్వారా డీఈవో సలీం భాష, డ్వామా పిడి మధుసూదన్, యోగ మాస్టర్ వెంకటేశ్వరరావు ఆయుష్ వైద్య అధికారిని డాక్టర్ విజయ్ కుమారి జిల్లాస్థాయి అధికారులు మెడికల్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు