
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అయినవిల్లి అక్టోబర్ 18:

పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి గ్రామ సచివాలయం ఆవరణoలో గ్రామీణ భాగస్వామ్య విశ్లేణాత్మక తులనం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పటం గీసి దానిలో ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు,చర్చి లు,రోడ్లు, హాస్పిటల్, పాఠశాలలు,తదితర కార్యాలయాలను, చపాతీ పటం, టైంలైన్ చార్ట్, మరియు మోబిలిటీ చార్ట్ను, ప్రాబ్లెమ్ ట్రీ, సీజనల్ క్యాలెండరు అలాగే సాగు చేస్తున్న పంటలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి, అతిధేయ రైతులు, మరియు అభ్యుదయ రైతులకు స్కూల్ పిల్లలకు వ్యవసాయకళాశాల రాజమహేంద్రవరం నాల్గవ సంవత్సరo ( RAWEP )రాయప్ విద్యార్థులు వివరించారు.

ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గుర్తించి వాటి పరిష్కార మార్గాలను తెలియజేయడం అని కార్యక్రమానికి విచ్చేసిన ఏరువాక కేంద్రం – అమలాపురం కోఆర్డినేటర్ డాక్టర్ యమ్.నందకిషోర్ మరియు వ్యవసాయ కళాశాల రాజమహేంద్రవరం అసోసియేట్ డీన్ ప్రతినిధి డాక్టర్ కె యమ్ దక్షిణామూర్తి వివరించారు.ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి వై శోభా గారు ఏ ఈ ఓ శ్యామ్ ప్రసాద్, వి ఏ ఏ మణికంఠ, కళాశాల విద్యార్థులు మణికంఠ, రోహిత్, రఘు, కృష్ణ, కిరణ్ కుమార్ రైతు సోదరులు తదితరులు పాల్గొన్నారు.
