ఈసారి” కోనసీమ బీచ్ ఫెస్టివల్ సంక్రాంతికి అత్యంత వైభవో పేతంగా.. కలెక్టర్ తో ఎమ్మెల్యే ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ఉప్పలగుప్తం అక్టోబర్ 15:

కోనసీమ బీచ్ ఫెస్టివల్ ను సంక్రాంతికి అత్యంత వైభవో పేతంగా కోనసీమ సాంస్కృ తి సాంప్రదాయాలు ప్రదర్శ న హోమ్ స్టే విధానాల ద్వారా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. బుధవారం స్థానిక ఉప్పలగుప్తం మండల పరిధిలోని ఎస్ యానం నందు కోనసీమ బీచ్ ఫెస్టి వల్ ఏర్పాట్లపై స్థానిక శాసనసభ్యులు అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీచ్ నందు మౌలిక వసతులు కల్పనకు, సందర్శకుల ఆతిధ్య మర్యాదలు వసతులు కల్పనకు స్థానిక శాసనసభ్యులు అయితాబత్తుల ఆనంద రావు అహర్నిశలు కృషి చేస్తున్నారని వారికి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు బీచ్ ఫెస్టివల్ నిర్వహణ కొరకు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా ఓం స్టే విధానాలతో టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు కోనసీమ ప్రాంతం ఎంతో అనువైనదని ఆ దిశగా ఓం స్టే విధానాన్ని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు ఎస్ యానం చుట్టుపక్కల కూడా బీచ్ ఫెస్టివల్ ఉత్స వాలకు వచ్చే సందర్శకులకు ఓం స్టే కొరకు గృహాలను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం సహాయంతో, స్థానిక పరిపాలన మరియు టూరిజం శాఖలు సంయుక్తంగా కోనసీమ బీచ్ ఫెస్టివల్ను విజయవంతం గావిం చాలన్నారు. తీర ప్రాంత సందర్శకులను ఆకర్షించడానికి, ప్రాంతీయ సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడా కార్యకలా పాలు, రుచికరమైన ఆహార మేళాల నిర్వహణకు పర్యా టకశాఖ ద్వారా చర్యలు చేపడతామన్నారు.

సంక్రాం తికి పెద్ద ఎత్తున బీచ్ నందు ఉత్సవాల నిర్వహణకు అందరూ సమన్వయం వహించాలని సూచించారు స్థానిక శాసనసభ్యులు ఆనందరావు మాట్లాడుతూ వివిధ రకాల మౌలిక వసతులు బీచ్ సంబంధిత కోనసీమ బీచ్ ఫెస్టివల్ ను కోనసీమ ప్రాంత వాసుల చరిత్రలో నిలిచిపోయేలా విధంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.

బీచ్ ప్రాంగణమునందు ఎటు వంటి అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా అధికారులు గ్రామస్తులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. జనవరిలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్ కు. రాష్ట్ర నలు మూలల నుండి సంక్రాంతి పండుగ సందర్భంగా అధిక సంఖ్యలో సందర్శకులు ఈ ఉత్సవాలకు హాజరవు తారని, వీటికి తగిన ఏర్పాట్లు చేయడం జరు గుతుందన్నారు గ్రామ ప్రజలంతా సహకరించి సంక్రాంతి సంబరాలను విజయవంతం చేయాలని కోరారు.

సి ఎస్ ఆర్ నిధులు ఎమ్మెల్యే నిధులతో కలిపి ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లించేలా ఎస్ యానం ప్రజానీకానికి 4 లక్షల వరకు ఆరోగ్య భీమా వర్తింపు కొరకు కృషి చేస్తున్నట్లు తెలిపారు బీచుకు ఇరు వైపులా కిలోమీటర్ పొడవునా లైటింగ్ ఏర్పాటు తోపాటు సీసీ కెమెరాల నిఘా పర్య వేక్షణలో ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

స్థానిక వ్యవసాయ, గిరిజన ఉత్పత్తుల ప్రదర్శనలు పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వాహణ
సంఘటిత రవాణా, పార్కింగ్, సందర్శకులకు అనుకూలంగా మార్గాల అత్యవసర చికిత్స, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ మహమ్మారి,అత్యవసర పరిస్థితులకు చర్యలు టూరిజం బీచ్ ఫెస్టివల్ నిర్వహణ సురక్షితంగా, ప్రత్యేకంగా, సందర్శకులను ఆకర్షించేలా ప్రభుత్వ ప్రోత్సాహం, స్థానిక టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగు తుందన్నారు.

ఈ కార్యక్ర మంలో , అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, ఆర్డీఓ మాధవి, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ లంకె భీమరాజు, అమలాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారి జయ వెంకటలక్ష్మి బాబ్జి, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, పలచోళ్ల పద్మనాభం, దంగేటి చిట్టిబాబు, అయితాబత్తుల రాజశేఖర్, ఇసుకపట్ల రఘుబాబు, పొలమూరి ధర్మపాల్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

చరిత్రలోనే నిలిచిపోయేలా బ్రిటిష్ కాలంనాటి మ్యాపులు ఆధారంగా రోడ్లు ఎమ్మెల్యే ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం అక్టోబర్ 06: అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని ప్రధాన పంట కాలువలు మురుగు కాలువలు సరిహద్దుల వెంబడి బ్రిటిష్ కాలంనాటి మ్యాపులు ఆధారంగా సర్వే నిర్వహిం […]

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు చాలా అవసరం: మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం జనవరి 31:విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు చాలా అవసరమని, క్రీడలు వారిలో శారీరక దృఢత్వాన్ని,మనోబలాన్ని పెంచుతాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ […]

మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు ఆధ్వర్యంలో చలో గుంటూరు మాల

V9 ప్రజా ఆయుధం అన్ లైన్ వార్తలు- మామిడికుదురు డిసెంబర్ 14:చలో గుంటూరు వర్గీకరణ వ్యతిరేక మాల మహానాడు బహిరంగ సభకు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాజీ శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో […]

మత్స్య కారులకు జీవనోపాధుల కల్పన ద్వారా భరోసా కల్పించాలి: కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం మార్చి 24: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మత్స్య కారుల జీవనోపాధుల కల్పన ద్వారా భరోసా కల్పించాలని జిల్లా స్థాయి అమలు కమిటీ […]