
టపాసాలు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు వహించండి, పర్యావరణాన్ని కాపాడండి, భూమిపై కాలుష్యాన్ని తగ్గిద్దాం: ఎమ్మెల్యే ఆనందరావు

తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం అక్టోబర్ 19:
అమలాపురం నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి ప్రదాత స్థానిక శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు గారు ఒక్కరోజు ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి కి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని ఎమ్మెల్యే ఆనందరావు గారు ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా.. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా,దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి ప్రతీ ఇంటా ఆనందాలను, సిరులను కురిపించాలని ఎమ్మెల్యే అయితాబత్తుల కోరుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని శాసనసభ్యులు ఆనందరావు అభిలషించారు. మనలో నీ అజ్ఞా నాందకారాన్ని తొలగించి, జ్ఞాన దీపాలు వెలిగించేదే దీపావళి.. ఈ దీపావళి పర్వదినాన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలి అని కోరుతూ అదేవిధంగా
మన అమలాపురం నియోజకవర్గం ప్రజానికం సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటూ అమలాపురం నియోజకవర్గం తో పాటు .. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలందరికీ ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
.ఈ వేడుకల్లో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్ర త్తలు తీసుకొని దీపావళిని పర్యావరణహితంగా సంతోషంగా జరుపుకోవాలని మ రొక్కసారి బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజానీకానికి శాసనసభ్యులు ఆనందరావు గారు
దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.