
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – డిసెంబర్ 26:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ రెవెన్యూ సదస్సులో భాగంగా గురువారం అయినవిల్లి మండలం, అయినవిల్లిలంక ,వీరవల్లి పాలెం ఇరు గ్రామాల్లో తహశీల్దార్ నాగలక్ష్మిమ్మ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూ వివాదాల సమస్యలు రెండు గ్రామాల రైతులు ఎమ్మార్వో దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మార్వో సమస్యలు పరిష్కారం కొరకు రైతులతో ఇరు ప్రాంతాలను ఆమె పర్యటించి రైతులు సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
