గ్యాస్ డోర్ డెలివరీ లో అదనపు చార్జీలు వసూళ్లు వద్దు: జాయింట్ కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం కలెక్టర్ రెట్ ఫిబ్రవరి 24:

రానున్న మార్చి ఒకటో తేదీ నుండి గ్యాస్ డోర్ డెలివరీలో అదనపు చార్జీలు వసూళ్లు చేస్తున్నారని మాట వినప రాకూడదని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిషాoతి గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులను డోర్ డెలివరీ సిబ్బందిని ఆదే శించారు. సోమవారం జిల్లాలో ఉన్న 31ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీల ప్రతిని ధులు వారి సంబంధిత డెలివరీ సిబ్బందితో స్థానిక గోదావరి భవన్ నందు సమావేశం నిర్వ హించి అదనపు డోర్ డెలివరీ చార్జీలు వసూ ళ్ళు, గ్యాస్ డోర్ డెలివరీ వద్ద తూనికలు ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం పేదలకు మేలు చేకూర్చాలనే ప్రధాన సంకల్పంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా దీపం 2 పథకాన్ని ప్రవేశపెట్టిందని ఇటీవల కాలంలో కోనసీమ జిల్లా ఎల్పిజి గ్యాస్ విని యోగదారుల నుంచి అదనపు డోర్ డెలివరీ చార్జీలు వసూలు చేస్తు న్నారని జిల్లా నుండి 70 శాతం మంది నుంచి ఫిర్యాదు లు ఐవిఆర్ఎస్, వాట్సాప్ క్యూఆర్ కోడ్, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా వెల్లడించారని ఆమె తెలిపారు.

డెలివరీ చార్జీలను రశీదులో ముద్రించిన సొమ్మును మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేశారు. డోర్ డెలివరీ లో అధిక చార్జీలు వసూళ్ల పై క్షేత్రస్థాయి తనిఖీల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉం డాల న్నారు.అదనపు సొమ్ము వసూలు చేస్తే టోల్ ఫ్రీ 1967 కు ఫిర్యాదు చేయవచ్చు నన్నారు. దీపం 2 పథకం అమలులో భాగంగా వినియోగదారులకు డెలివరీ బాయ్స్ ఎల్పీజీ సిలిండర్లు డెలివరీ చేసే సమయంలో అదనపు సొమ్ము వసూలు చేస్తున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ఈ నేపథ్యంలో పౌరసర ఫరాల కమిషనర్ వారు గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు డెలివరీ సిబ్బందితో సమావేశం నిర్వ హించి అవకత వకలకు పాల్పడకుండా గట్టి నిఘా వ్యవస్థ ను అమలు చేయాలని సూ చించడం జరిగిందన్నారు ఆదేశాలు పాటించని పక్షంలో సం బంధిత గ్యాస్ డెలివరీ బాయ్స్ మరియు పంపి ణీదారుల పై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అటువంటి గ్యాస్ పంపిణీ ఏజన్సీ లను బ్లాక్ లిస్టులో పెట్టి వారి లైసెన్సులను రద్దు చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు దీపం-2 పథకo ద్వారా అర్హులైన ప్రతి వినియోగదారునికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించడం జరుగుచున్నదని తెలిపారు.

ఈ పథకంలో అమలులో భాగంగా ఎల్పిజి డెలివరీ బాయ్స్ వినియోగదారుల ఇంటి వద్ద సిలిందర్ లు సరఫరా చేయు సమయము లో వినియోగదారుల నుండి నిర్ణీత మొత్తం కంటే అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయా నికి ఫిర్యాదులు అందుతు న్నాయని పౌరసరఫరాల కమీషనర్ తెలిపార న్నారు. ఈ విషయమై జిల్లాలోని వివిధ గ్యాస్ పంపిణీదారులు మరియు సంబంధిత గ్యాస్ పంపిణీదారులతో సమావేశం నిర్వహించి విధివిధానాలపై సమీక్షించడం జరిగిందన్నారు ఎట్టి పరిస్థితులలోనూ గ్యాస్ వినియోగదారుల రశీదు లో ముద్రించి ఉన్న ధరను మిం చి, గ్యాస్ వినియో గదారుల నుంచి అదనపు సొమ్ము వసూలు చేయరాదని స్పష్టం చేశారు. అలాగే, పౌర సర ఫరాల సిబ్బంది మరియు గ్యాస్ మార్కెటింగ్ కంపెనీ సేల్స్ అధికారులను క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వ హించి, గ్యాస్ పంపిణీదా రులు మరియు డెలివరీ బాయ్స్ గ్యాస్ వినియోగ దారుల నుంచి అదనపు సొమ్ము వసూలు చేయ కుండా నిరంతరం పర్య వేక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసు కొనవల సినదిగా ఆదే శించడం జరిగిందన్నారు. గ్యాస్ ఏజెన్సీలు వారి డెలివరీ సిబ్బంది మార్చి ఒకటో తేదీ నుండి ఎక్కడ ఎటువంటి ఫిర్యా దులు ఉత్పన్నంకాకుండా సమన్వయంతో పనిచే యాలని ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఎట్టి పరిస్థితుల లోను ఉపేక్షించేది లేదని ఆమె హెచ్చరించారు తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ రాజేష్ మాట్లాడుతూ డోర్ డెలివరీ వద్ద సిలిండర్ల తూనికను సీళ్లను పర్య వేక్షించడం జరుగుతుం దని కేవలం 150 గ్రాముల వరకు వ్యత్యాసాలను అనుమతి స్తామని ఆపై వ్యత్యాసాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అను మతించబోమని స్పష్టం చేశారు. జిల్లా పౌర సరఫరాల మేనేజర్ ఎం బాలసరస్వతి మాట్లా డుతూ అలాగే, గ్యాస్ వినియోగదారులు, వారికి చ్చిన రశీదులో ముద్రించి ఉన్న ధర కంటే అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవ సరంలేదని, ఆ విధoగా కాకుండా లబ్దిదారుల నుండి గ్యాస్ ఏజన్సీలు అదనంగా డబ్బులు వసూలు చేసినట్ల యితే, వినియోగదారుడు సంబంధిత గ్యాస్ మార్కెటింగ్ కంపెనీ సేల్స్ అధికారికి, మండల తహశీల్దార్ ,పౌర సరఫ రాల ఉప తహశీల్దార్ లేదా జిల్లా పౌర సరఫరా ల అధికారి వారికి ఫిర్యా దు చేయవలసిన దిగాను లేదా టోల్ ఫ్రీ నెం. 1967 ద్వారా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవ చ్చని తెలిపారు. కావున, వినియోగదారులకు ఎల్పీజి సిలిండర్లను ఎటువంటి ఆటంకం లేకుండా పంపిణీ చే యాలని, ఈ పథకoలో ఎటువంటి అవకతవకలు జరిగినా బాధ్యులైన ఎల్పీజి డిస్ట్రిబ్యూటర్స్ మరియు డెలివరీ బాయ్స్ పై కఠిన చర్యలు తీసు కోవడం జరుగుతుందని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీల ప్రతి నిధులు డెలివరీ సిబ్బంది పాల్గొన్నారు

Related Articles

అమలాపురం కలెక్టర్ మహేష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 10: జిల్లా అభివృద్ధికి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల తీసుకునే చర్యలకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారి జీవితం సుఖ శాంతులతో, […]

భూములు మార్కెట్ విలువలు ప్రభుత్వ ఉత్తర్వుల సవరించడానికి చర్యలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం డిసెంబర్ 19: కోనసీమ జిల్లాలో జిల్లా రిజిస్టర్, సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో భూముల మార్కెట్ విలువలు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సవరించడానికి చర్యలు చేపట్టినట్లు […]

స్మార్ట్ రేషన్ కార్డులో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గానే పేరు:జాయింట్ కలెక్టర్ టి నిషాంతి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 17: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రేషన్ అక్ర మాలకు చెక్ పెడుతూ ఆధునిక సాంకేతికతతో క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ […]

ముమ్మిడివరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి నిధులు మంజూరు : ఎంపీ హరీష్, బుచ్చిబాబు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం జూలై 08: డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి సి ఎస్ ఆర్ నిధుల […]