ఎస్సీ,ఎస్టీ అట్రాసిటికేసుల విచారణవేగవంతం:ఎమ్మెల్యే ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం డిసెంబర్ 26:ఎస్సీ ఎస్టీలపై అన్యాయంగా దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు గైకొనాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. గురువారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,కలెక్టరేట్ నందు ఎస్సీ ఎస్టీ దురాగతాల నివారణ చట్టం అమలుపై ఎస్సీ ఎస్టీ నిఘా మరియు పర్యవేక్షణ జిల్లాస్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాలు తెగల అట్రాసిటీ కింద నమోదైన కేసులు సత్వరమే పరిష్కరించి తగు న్యాయం చేకూర్చే దిశగా రెవెన్యూ పోలీస్ న్యా యవ్యవస్థలు కృషి చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడులు అఘాయిత్యాల సమాచారాన్ని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా విచారించి, పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అణగారిన వర్గాలలో జరుగుతున్న అన్యాయాలపై రాజ్యాంగ విలువలను కాపాడేందుకు కమిటీ సభ్యులు అంకిత భావంతో పాటుపడాలన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించి దళితులకు ఎక్కడా అన్యాయం చోటు చేసు కోకుండా చూడాలన్నారు జిల్లాలో సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే లక్ష్యంగా అధికారులు పారదర్శకంగా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలన్నారు అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా, సమాజంలో ఎస్సీ ఎస్టీలపై దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత చట్టాల పట్ల అవగాహన పెంపొం దించా ల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులలో కేసుల సత్వర పరిష్కారం కొరకు ఎటువంటి జాప్యం జరగ కుండా జాగ్రత్తలు వహించాలన్నారు. కేసుల సత్వర విచారణకు అవసరమైన ధ్రువ పత్రాలు ఎప్పటికప్పుడు తహశీల్దార్లు జారీ చేయాలన్నారు. నిజమైన బాధితులకు న్యాయం జరగాలని, ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కులు, రక్షణ కొరకు ఏర్పాటైన చట్టాల పటిష్ట అమలుకు పోలీస్, న్యాయ రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు గతంలో జరిగిన కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను, ఈ త్రైమాస కాలంలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ, బాధితులకు పరిహారాల పంపిణీ పురోగతిని సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 95 కేసులు నమోదు కాగా వీటిలో ప్రాథమిక విచారణ దశలో 52 కేసులు, చార్జి సీటు దశలో 49 కేసులు, పోస్ట్ మార్టం దశలో రెండు కేసులు ఉండగా సంబం ధిత బాధితులకు రూ 81, లక్షల 25 వేలు చెల్లించాల్సింది ఉందని 30 లక్షలు మేర మాత్రమే నిధులు ఇటీవల మంజూరు కావడం జరిగిందన్నారు పౌరులందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించే రాజ్యాంగ మౌలిక స్పూర్తికి అనుగుణంగా ఏర్పాటు కాబడిన ఎస్సీ ఎస్టీ ప్రత్యేక చట్టాలను అధికారులు పటిష్టంగా అమలు చేయాలన్నారు. స్థానికంగా కోనసీమ జిల్లాకు ఎస్సీ ఎస్టీ కోర్టు మంజూరు అయిందని తెలిపారు ఎస్సీ ఎస్టీలకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా కల్పిస్తున్న రుణ సదుపాయాల ద్వారా సుస్థిర జీవనో పాదుల కల్పనకు పాటు పడాలన్నారు ఆర్డబ్ల్యూ ఎస్ వారు ఎస్సీ ఎస్టీ కాలనీలకు జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయిని వేయాలన్నారు. సఫాయి కర్మచారి కార్మికులకు పథకాల ద్వారా లబ్దిని చేకూర్చాలన్నారు పీఎం అజయ్ కార్యక్రమం ద్వారా మండలానికి నాలుగు చొప్పున యూనిట్లు గ్రౌండ్ చేయాలన్నారు. డ్వామా ద్వారా వేతన జీవులకు నూరు శాతం పని దినాలు సరాసరి వేతనాలు చెల్లిస్తూ మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా ఆవాసాలలో మౌలిక వసతులను కల్పించాలన్నారు. లక్షిత వర్గాల వారికి ఉద్యాన సాగును పథకాలు,రాయితీలతో ప్రోత్సహించి జీవన ప్రమాణాలను మెరుగుప రచాలన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా నిర్దేశిత ఎస్సీ ఎస్టీ లబ్ధిదా రులకు ట్రావెలింగ్ బిజి నెస్ క్వాయర్ పరిశ్రమల కు రాయితీతో యూనిట్లు గ్రౌండ్ చేయాలన్నారు. అదేవిధంగా పశుసంవర్ధక శాఖ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాల ద్వారా లక్షిత వర్గాలకు లబ్ధిని చేకూర్చాలన్నారు స్థానిక శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ పోలీస్ అధికారులు తమ స్టేషన్లకు వచ్చిన ఫిర్యా దులపై రాజీపడాలని ధోరణిని ప్రదర్శించడంతో మరల అవే కేసులు పునరావృతం అయ్యి జటిలంగా మారుతున్నాయని కావున ఫిర్యాదులు వచ్చిన సందర్భంలో స్వీకరించి తప్పనిసరిగా విచారించాలని సూచించారు. కేసులలో ఎఫ్ఐ ఆర్, చార్జి సీటు నమోదు ప్రస్తుత స్థితిగతులు పురోగతి అంశాలు ప్రతి శాఖలో సంక్షేమ పథ కాలకు నిధులు మంజూరు కేటాయింపులపై సంబంధిత శాసన సభ్యులకు నివేదిక సమర్పించిన యెడల ఆ యొక్క పథకాలకు అర్హుల ఎంపికకు అవకాశం అధికారులతో పాటు తమకు లభిస్తుందన్నారు తప్పుడు కేసులు విషయంలో ఏయే కారణాలు చేత ఆయా కేసులను తిరస్కరించారో కూడా తెలియజేయాలని ఆయన స్పష్టం చేశారు. బాధితులకు పరిహారం ఉపాధి కల్పన విషయం లో జాప్యం జరగకుండా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు.

శాంతియుతమైన సామరస్య మైన పౌర జీవనాన్ని పెంపొందించేందుకు ఈ చట్టాల గురించి అన్ని వర్గాల ప్రజలకు సమగ్ర మైన అవగాహన కల్పించాలని సూచించారు. ఆర్థిక సామాజిక రంగాలలో సమాన అవ కాశాలను పొందేందుకు సామాజిక న్యాయం అందించేందుకు అగ్రవర్ణాల అత్యాచారాల నుండి రక్షణ పొందేందుకు ఈ చట్టం రూపొందించబడిందన్నారు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటికేసుల విచారణ వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించా లన్నారు. దోషులకు తప్పనిసరిగా శిక్షపడా లని ప్రేరేపిత కేసులకు ఆస్కారం ఇవ్వరాదన్నారు, లక్షిత వర్గాలకు సామాజిక న్యాయం అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని,అదే స్పూర్తితో కమిటీ సభ్యులు ప్రయోజనకరమైన, నిర్మాణాత్మ కమైన సూచనలు, సమీక్షలతో ఎస్సీ, ఎస్టీ వర్గాల రక్షణ, హక్కుల పరిరక్షణ కొరకు పనిచే యాలన్నారు.ఎస్సీ, ఎస్టీ కేసుల పరిశోధన విచారణ ప్రగతి, విచారణ, కోర్టు కేసులలో కన్విక్షన్, బాధితులకు పరిహారం అంశాలపై పోలీస్, రెవెన్యూ శాఖలు శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి, అడ్మిన్ ఎస్పీ ప్రసాద్, డిఆర్ఓ ఇన్ఛార్జ్ కే మాధవి, ఆర్డీవోలు పీ శ్రీకర్ డి అఖిల, జిల్లాస్థాయి అధికారులు డిఎస్పీ లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

నేడు విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముఉ.11:30 గంటలకు విజయవాడ చేరుకోనున్న ముర్ముమ.12:05 గంటలకు మంగళగిరిలో..ఎయిమ్స్ స్నాతకోత్సవానికి హాజరుకానున్న ముర్ముపాల్గొననున్న గవర్నర్‌ నజీర్‌, చంద్రబాబు, పవన్‌సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు

అట్టడుగు వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా నిరంతర పోరాటం యోధుడు మహాత్మ జ్యోతిరావు పూలే

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఏప్రిల్ 11: బడుగు వర్గాల ఆశాజ్యోతి, అట్టడుగు వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన యోధుడు మహాత్మ జ్యోతిభా పూలే ఎందరికో స్ఫూర్తి […]

రేపు అమలాపురం రానున్నా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు.

రేపు అమలాపురం పట్టణానికి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. V9 ప్రజా ఆయుధం దినపత్రిక – అమలాపురం కలెక్టరేట్ డిసెంబర్ 27:డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రెట్ కు బుధవారం రాష్ట్ర […]

చలో గుంటూరు మాల సభా వేదిక పై ముగించిన పరిచయం

వర్గీకరణకు వ్యతిరేకంగా చలో గుంటూరు మాల మహా గర్జన సభా ప్రారంభం లో సభా వేదికపై ఆంధ్ర తెలంగాణ మాల మహానాడు నాయకులు మరియు మాజీ మంత్రులు పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులను పరిచయం చేశారు. […]