SBI Clerk 6589 Posts | ఎస్బీఐలో 6,589 క్లర్క్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు! ఎలా ఎంపిక చేస్తారంటే..

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఉద్యోగ అవకాశాలు – ఆగస్టు 19:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాంచుల్లో క్లరికల్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్) ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం మొత్తం 6,589 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిల్లో 5,180 రెగ్యులర్ పోస్టులు, 1,409 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 26, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి.

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే డిసెంబర్ 31, 2025 నాటికి అభ్యర్ధులు గ్రాడ్యుయేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఏప్రిల్ 1, 2025వ తేదీ నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే ఏప్రిల్ 02, 1997 నుంచి ఏప్రిల్ 01, 2005 మధ్య జన్మించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిబంధనల మేరకు ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 26, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.750 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌ఎస్‌, డీఎక్స్‌ఎస్‌ అభ్యర్థులకు ఎలంటి ఫీజు లేదు. ప్రిలిమినరీ, మెయిన్స్‌, స్థానిక భాష ప్రావీణ్యం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 24,050 నుంచి రూ.64,480 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం ఇలా..

ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు వంద ప్రశ్నలకు 1 గంట సమయంలో సమాధానాలు గుర్తించవల్సి ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్‌ పరీక్ష ఆబ్జెక్టివ్ విధాంనలో 200 మార్కులకు 200 ప్రశ్నలకు 2 గంటలు 40 నిమిషాల సమయంలో పరీక్ష ఉంటుంది. అనంతరం స్థానిక భాషా పరీక్ష నిర్వహిస్తారు. నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రిలిమ్స్ & మెయిన్స్‌లో ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున కోత విధిస్తారు.

Related Articles

వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటించాలి: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జనవరి 16: డ్రైవింగ్ ను వ్యక్తిగత అనుభవంగా కాకుండా సామాజిక బాధ్యతగా గుర్తించాలి: కలెక్టర్ మహేష్ కుమార్ వాహనదారులు రహదారి భద్రత […]

సోషల్ వర్కర్ చంద్రకుమార్ కుటుంబాని పరామర్శించిన ప్రజా నాయుకులు.

నేరేడుమిల్లి చంద్రకుమార్ కు ఘన నివాళులు అర్పించిన ప్రజా నాయకులు సోషల్ వర్కర్ గా పేరు పోందిన నేరేడుమిల్లి చంద్రకుమార్ 35 సం”ఇటివలే ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూమరణించారు. శనివారం ఆయనకు దినకర్మ కార్యక్రమాన్ని […]

వైసీపీ కి మాజీ మంత్రి శైలజానాథ్ జగన్ సమక్షంలో పార్టీ తీర్థం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – తాడేపల్లి ఫిబ్రవరి 07: మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తీర్థం […]