
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 28:

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో పీహె చ్.డి ప్రవేశం పొంది న శ్రీ లలితను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అభినందించారు బుధవారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరే ట్ నందు జిల్లా కలెక్టర్ ని కలిసిన ఆమెకు మన స్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.ప్రముఖ ఏఐ శాస్త్రవేత్త కర్రా సంతోష్ శాస్త్రి సతీమణికి అరుదైన ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ మెషీన్ లెర్నింగ్ రంగాలలో పరిశోధన చేయాలన్న సంకల్పంతో ముందు కెళ్లిన శ్రీ లలిత, భారత దేశపు అత్యంత ప్రతిష్టా త్మక విద్యాసంస్థలలో ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీ, వారణాసిలో పీహె చ్.డి ప్రవేశం సాధించార న్నారు శ్రీ లలిత, ప్రముఖ ఆర్టిపిసియల్ ఇంటిలి జెన్సీ (కృత్రిమ మేధ) శాస్త్రవేత్తగా సీటు పొందడం సంతోషించ దగ్గ పరిణామమన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర వేత్తగా దేశవ్యాప్తంగా పేరు గాంచిన కర్రా సంతోష్ శాస్త్రి సతీమణి శ్రీ లలిత అన్నారు.

1919లో స్థాపితమైన బనారస్ హిందూ యూనివర్సిటీలో భాగంగా ఉన్న ఐఐటీ, భారతదేశం మొత్తంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ టెక్నిక ల్ విద్యాసంస్థలలో ఒకటి గా గుర్తింపు పొందిందన్నా రు. పరిశోధన, సాంకేతిక అభివృద్ధిలో ఈ సంస్థ మకుటాయమానంగా నిలుస్తోందన్నారు. ఇలాంటి చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన వేదిక పై శ్రీ లలిత కృత్రిమ మేధ సంబంధిత అంశాలలో డాక్టరేట్ స్థాయిలో పరి శోధన చేయనున్నార న్నారు ఆమె భవిష్యత్తు పరిశోధనలకు ఆయన శుభాకాంక్షలు తెలియజే స్తూ, దేశానికి సాంకేతికం గా కొత్త దారులు చూపే పరిశోధనలకు ఆమె తోడ్పాటు అందించగల రనే ఆశాభావం జిల్లా కలెక్టర్ వ్యక్తం చేశారు.