సినీ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఆనందరావు

తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం అక్టోబర్ 22:

సినీ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం అమలాపురం పట్టణం కొంకాపల్లి క్షత్రియ కళ్యాణ మండపం వద్ద రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ సత్తిబాబు రాజు ఆధ్వర్యంలో ఒక్కరోజు ముందు అడ్వాన్సుగా హీరో ప్రభాస్ కు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.

ఈ పుట్టినరోజుకు ముఖ్య అతిథిగా అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు విచ్చేశారు. ఎమ్మెల్యే ఆనందరావు సమక్షంలో పుట్టినరోజు కేకును కోసి ప్రభాస్ కు శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ్యులు ఆనందరావు మాట్లాడుతూ.. భారత, ప్రపంచ దేశాలలో చిన్న వయసులోనే సినీ పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఏకైక నాయకుడు ప్రభాస్ అని పేర్కొన్నారు. ఆయన మన ప్రక్క జిల్లా పశ్చిమగోదావరి జిల్లాలో మొగల్తూరు గ్రామంలో జన్మించటం అందరికీ సంతోషకరమైన విషయం అన్నారు.

ఆయన నటనకు 2013లో ‘మిర్చి’ సినిమాకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు గెలుచుకున్నారు. అలాగే, 2010లో ‘డార్లింగ్’ సినిమాకి జ్యూరీ అవార్డు గెలుచుకున్నారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే లక్షణం ఆయన అవలంబించుకున్నారని కొనియాడారు. అంతేకాకుండా విపత్తు కాలాలు లో రెండు తెలుగు రాష్ట్రాలకు తన వంతుగా కోట్లాది రూపాయలు ఆర్థిక పరమైన సహాయం చేసిన ఆయన ఉదారంగం కనబరిస్తుంది అన్నారు.

అయిన ఈ సందర్భంగా మరోసారి 1979 అక్టోబరు 23న పుట్టిన ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ (ప్రభాస్ రాజు) కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ… నటన జీవితంతో పాటు మంచి ఆరోగ్య, ఆయుస్సు, ఐశ్వర్యాలతో తులతూగాలి అని భగవంతుని కోరుకుందాం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహ కార్యదర్శి మెట్ల రమణబాబు, ఆముడా చైర్మన్ అల్లాడి స్వామి నాయుడు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు, ముత్యాల బాబి, ఈతకోట నాగేశ్వరరావు, కుంచె వెంకన్న బాబు, రోక్కాల నాగేశ్వరరావు, ముత్తాబత్తుల రమణ మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

బహిరంగ ఇసుక రీచ్ లు రేపటినుండే అమ్మకాలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 7: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 20 ఇసుక రీచ్ లలో రుతుప వనాలు సమీపిస్తున్నం దున ఈ నెల […]

ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తిని తగ్గించేందుకు చర్యలు DM&HOC డి భరత లక్ష్మి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 25 ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తిని తగ్గించే ముఖ్యమైన చర్యలలో భాగంగా ఎయిడ్స్ పరీక్షలను, నిర్థారణను పెద్దఎత్తున నిర్వహిస్తూ నియంత్రణ చర్యలను బలోపేతం […]

రాష్ట్ర ప్రభుత్వం పశుపోషకులకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ -కే గంగవరం, జనవరి 24; రాష్ట్ర ప్రభుత్వం పశుపోషకులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. […]

విజయవాడలో దక్షిణ భారత విజ్ఞాన ప్రదర్శన. ఉపాధ్యాయులను అభినందించిన కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం 09:విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి దక్షిణ భారత విజ్ఞాన ప్రదర్శన లో డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం తొండవరం […]