

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 11:
రుతుపవనాలు, వర్షాలు నేపథ్యంలో పైప్ లైన్లు లీకేజీలు కలుషిత నీటి సరఫరా పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తూ అన్ని విధాల ప్రజలకు సురక్షితమైన త్రాగు నీటిని సమృద్ధిగా అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగ ఇంజనీర్లను ఆదేశించారు.

శుక్రవారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నందు ఆర్డబ్ల్యూ ఎస్ ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి వివిధ రకాలుగా పైప్ లైన్లు లీకేజీ మూలంగా కలుషిత త్రాగు నీరు సరఫరా చేయ కుండా మెలకువలు, కీటక జనత వ్యాధులు నియం త్రణ చర్యలు, సంక్షేమ వసతి గృహాలలో మరుగు దొడ్ల నిర్మాణం అంశాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి ఇంజనీర్లు యొక్క సీజన్లో అప్రమత్తంగా ఉం టూ ఎటువంటి సీజనల్ వ్యాధుల బారిన ప్రజలు పడకుండా సురక్షితమైన త్రాగునీటిని సరఫరా చేయాలని స్పష్టం చేశారు. డయేరియా కీటక జనత వ్యాధులైన డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వ్యాధులు వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు సమర్థవం తంగా ఇంజనీరింగ్ విభాగం పనిచేయాలన్నారు.

ఎప్పటికప్పుడు త్రాగునీరు నమూనాలను ల్యాబ్ లలో సురక్షితంగా ఉన్నది లేనిది పరీక్షలు నిర్వహిస్తూ అన్ని విధాల సురక్షితమైన భావిం చిన త్రాగునీటిని మాత్రమే సరఫరా చేయాలని ఆదేశిం చారు. వివిధ వసతి సంక్షేమ గృహాలలో మరుగుదొడ్ల నిర్మాణం కొరకు భూసేకర ణలో సమస్యలు ఉన్నట్ల యితే సంబంధిత తాహసి ల్దార్లకు, వసతి గృహ సంక్షే మ అధికారులకు తెలియ జేసి భూసేకరణకు కృషి చేస్తూ మరుగు దొడ్ల బ్లాకు లను నిర్మించాలన్నారు. పైప్ లైన్లు లీకు మరియు త్రాగునీరు కలుషితం అయినదని భావించిన సందర్భాలలో పైప్లైన్ ద్వారా నీటి సరఫరా నిలిపివేసి సురక్షితమైన త్రాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సిహెచ్ ఎన్వి కృష్ణారెడ్డి, డివిజనల్ ఇంజనీర్లు రాంప్రసాద్, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 11: