
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 26: డాక్టర్ బి.ఆర్ అం బేద్కర్ కోనసీమ జిల్లాలో చమురు సహజవాయువుల నిక్షేపాలను వెలికి తీసి వ్యాపారాలు నిర్వహిస్తున్న చమురు సహజ వాయువుల సంస్థల కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి ఎస్ ఆర్) నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అంచనాలు రూ పొందించాలని వివిధ శాఖల ఇంజనీర్లను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో సిఎస్ఆర్ నిధులు మంజూరు కేటా యింపుల అంచనాల రూపకల్పన పై అధికారు లు ఇంజనీర్లుతో చర్చిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజ కవర్గాల వారీగా ప్రజాప్రతి నిధులు తెలిపి న పనుల కు సంబంధించి అంచనాలు రూపొందిం చాలని ఇంజనీర్లను ఆదేశించారు. సముద్ర ముఖద్వారం వద్ద వద్ద డ్రెడ్జింగ్ పనులు, చేపడు తూ వివిధ పంట ల ముంపు బెడద నివారణ చర్యలు, అధునాతన డ్రోన్ సాంకేతిక టెక్నాలజీ ఆధారంగా కాలువలు, డ్రెయిన్ల స్థలాల ఆక్రమ ణలను గుర్తింపు మౌలిక సదుపాయాలైన రోడ్లు, విద్యా సంస్థలలో మౌలిక వసతులకు సంబంధించి న మరమ్మత్తులు వంటి పనులకు అంచనాలు రూపొందించి చమురు సహజ వాయువుల సంస్థలకు మంజూరు నిమిత్తం సమర్పించాలని జిల్లా అర్ద గణాంకాధికారి (సిపిఓ) ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ వెంకటేశ్వర్లు పంచాయి తీరాజ్ సూపరింటెండెం ట్ ఇంజనీర్ పి రామ కృష్ణారెడ్డి, డి ఈ రాజకు మార్, ఆర్డబ్ల్యూ ఎస్ ఎస్సీ సిహెచ్ ఎన్వి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.