ఇజ్రాయిల్ దేశంలో మరణించిన వానపల్లి ప్రసాద్ కుటుంబానికి రెండు లక్షల ఏడు వేలు/- ఆర్థిక వివరాలు

తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 22:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపా లెం మండలం రావులపాలెం చెందిన వానపల్లి విదేశాల లో ఉపాధి పొంది కుటుంబాన్ని పోషించు కునే నిమిత్తం ఇజ్రాయిల్ దేశంలో అష్దూద్(Ashdood ) ప్రాంతంలోని సిమెంట్ ఫ్యాక్టరీలో ఉపాధి నిమిత్తం చేరి మిషిన్ శుభ్రం చేస్తూ ఉండగా ప్రమా దవశాత్తు జారిపడి నట్లు గమనించి అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే సి పి ఆర్ చేస్తుండగా మరణించినారని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. వానపల్లి సత్తి రాజు కుమారుడు వానపల్లి ప్రసాద్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావుల పాలెం గ్రామ o  కొత్తకాలనీ కి చెందిన వాస్తవ్యుడన్నారు అయితే ఆ ఫ్యాక్టరీ వారు మృతుని యొక్క కుటుంబానికి ఫోన్ చేయగా వారు కంగారు పడి సహాయం నిమిత్తం స్థానిక శాసనసభ్యులు బండారు సత్యా నంద రావు వారిని సంప్రదించగా కోనసీమ వలసదారుల కేంద్రాన్ని అమ లాపురంలోసంప్రదిస్తే తగు పరిష్కారం లభిస్తుందని తెలిపారన్నారు.

ఆ మేరకు బాధిత కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ సంప్రదించి వానపల్లి ప్రసాద్ మృతదేహాన్ని భారతదే శానికి తీసుకుని వచ్చేందు కు చర్యలు చేపట్టాలని కోరారన్నారు . కోనసీమ మైగ్రేషన్ బృందం వెంటనే మృతుని కుటుంబ సభ్యు లు ద్వారా మృతుని వివ రాలు తెలుసుకొని వెంటనే భారత రాయబార కార్యాల యానికి తెలిపి ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రా యెల్ కన్స్ట్రక్షన్ తెలుగు వర్కర్స్ అసోసియేషన్ తరపున కేసీఎం బృందం వానపల్లి ప్రసాద్ (మృతుడు) కి సంబం ధించిన అన్ని విషయా లు దగ్గరుండి చూస్తున్నట్టు ఆయన తెలిపారు కె సి ఎం బృందం అనుక్షణం కాంటాక్ట్ లో ఉంటూ వానపల్లి ప్రసాద్ మృతదేహన్ని ఇండియాకు తీసుకున్న రావడానికి కావలిసిన ప్రతి డాక్యుమెంట్  వారికి అందించి, కావలిసిన ధ్రువప త్రాలు మెయిల్ ద్వారా పంపి, టాక్సీకాలజీ పరీక్ష కోసం తండ్రి దగ్గర నుండి అంగీకార పత్రాలను ఇజ్రాయిల్ లోని భారత రాయ బార కార్యలయానికి పంపించి . కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ వానపల్లి ప్రసాద్ మృత దేహం స్వగ్రామానికి వచ్చేలా కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ కేంద్రం గవర్నమెంట్ అఫ్ ఆంధ్రప్ర దేశ్ ,కేంద్ర ప్రభుత్వం,ఎ పి ఎన్ ఆర్ టి, ప్రొటెక్టర్ అఫ్ ఇమీగ్రేంట్స్, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖతో వారితో సంప్రదిం పులు జరిపి వానపల్లి ప్రసాద్ మృత దేహాన్ని తల్లి తల్లితండ్రులుకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నామన్నా రు.మృతుడి తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడు తున్న దృష్ట్యా ఇజ్రాయెల్ కన్స్ట్రక్షన్ తెలుగు వర్కర్స్ అసోసియేషన్ తరుపున ఏర్పాటు చేసిన రూ 2 లక్షల 7వేల సొమ్మును మృతుడి కుటుంబానికి అం దించటం జరిగిందన్నారు ప్రభుత్వం ద్వారా తగిన సహాయ అందిస్తామని కంపెనీ ద్వారా అందవలసిన ఇన్సూరెన్సు లు ఉంటే వాటిని రాబట్టే ప్రయత్నం చేస్తామని త్వరలో మృత దేహా న్ని కూడా అందరి సహాకారంతో ఇండియాకు తీసుకువస్తామని తెలిపారు మృతుడి తండ్రి సత్తి రాజును. సోదరులను ఓదార్చి వారికీ ధైర్యాన్ని నింపారు ఎవరైనా ఇతర దేశాలకు వెళ్లి అక్కడ ఉద్యోగాలు పొందా లనుకుంటే వారు ఒక సరైన అను మతులు ఉన్న ఛానెల్ ద్వారా మాత్రమే వెళ్లాలని అదేవిధంగా భారత ప్రభు త్వం ధ్రువీకరిం చిన రిజిస్టర్డ్ ఎజెన్సీ ల ద్వారా మాత్రమే వెళ్లాలని ఉపాధి నిమిత్తం వెళ్లే ప్రతి ఒక్కరు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కోన సీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ను సంప్రదించి పూర్తి వివ రాలు తెలుసుకుని వారి మార్గ నిర్దేశంలో వెళ్లాలని అయన కోరారు. కె సి ఎం తరుపున అన్ని విధాలుగా సహకరిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ యొక్క సహాయక చర్యలలో నోడల్ అధికారి కె మాధవి, సమన్వయ అధికారి జి రమేష్, సిబ్బంది ఎం ఎం సఫియా సత్తిబాబు, దుర్గా పాల్గొన్నారు.

Related Articles

షైనింగ్ స్టార్ – 2025 అవార్డులను 168 మంది విద్యార్థిని విద్యార్థులకు సత్కారం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 09: విద్యా వ్యవస్థలో నాణ్యత, ప్రమాణాలు పెంచేందుకు పదవ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డులను […]

చైర్మన్ వినయ్ కుమార్ కు అనకాపల్లిలో స్వాగతం తో రారాజు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అనకాపల్లి జనవరి 16:V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధినేత కు అనకాపల్లి లో రారాజు స్వాగతం పలికారు. డాక్టర్ బి […]

అల్లు అర్జున్ బెయిల్ మంజూరు

సినీ హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించింది. పుష్ప2′ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన […]

ఊడిమూడి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం

రామచంద్రపురం 21 డిసెంబర్ ప్రజా ఆయుధం :: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కె.గంగవరం మండలం ఊడిమూడి గ్రామంలో తాడాల బుజ్జి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 8 గంటలకు మెగా మెడికల్ […]