
తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం అక్టోబర్ 23:

విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహణకు క్రమబద్ధమైన ప్రణాళిక, సమయపాలన విద్యార్థులు పాల్గొనేలా వాతావరణం కల్పించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్ మహేష్ కుమార్ విద్య శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక అమలాపురం కలెక్టరేట్ నందు రెండవ దఫా కోనసీమ క్రీడోత్సవాలు నిర్వహణ ఏర్పాట్లపై విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు.

క్రీడా కమిటీలను వ్యాయా మ ఉపాధ్యాయులు విద్యార్థి ప్రతినిధులను కలిపి కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. మూడు రోజుల క్రీడా పోటీల ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. బడ్జెట్ ప్రణాళిక లో క్రీడా పరికరాలు, బహుమతులు, నీటి సదుపాయం, ప్రథమ చికిత్స మొదలైన వాటికి ఖర్చు అంచనాలు రూపక ల్పన చేయాలన్నారు.తరగతి వారీగా జట్లను లేదా వ్యక్తిగత ఆటగాళ్లను నమోదు చేయాలన్నారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక క్రీడలో పాల్గొనేలా అన్ని విధాలా ప్రోత్సహించాలన్నారు.ప్రతి ఆటకు టైమ్ టేబుల్ తయారు చేసి నోటీసు బోర్డుపై ప్రదర్శించాలన్నారు.

ప్రిలిమినరీ రౌండ్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ క్రమంగా ప్లాన్ చేయాల న్నారు.ఆటల మధ్య విశ్రాంతి సమయం ఇవ్వాలన్నారు. సదుపాయాలు కల్పన తో పాటుగా భద్రతపై దృష్టి పెట్టాలన్నారు.ఫస్ట్ ఎయిడ్ కిట్, తోపాటుగా త్రాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణ తప్పనిసరన్నారు విద్యార్థులు నియమాలు పాటిస్తున్నారా లేదా అన్నది తప్పనిసరిగా పర్యవేక్షించా లన్నారు. ముగింపు బహు మతుల ప్రధానం సమయం లో పిల్లల తల్లిదండ్రులు హాజరు కావాలన్నారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో బాలురకు 60 మీటర్లు లాంగ్ జంప్, బాల్ త్రో లెమన్ స్పూన్ నిర్వ హించాలని బాలికలకు 60 మీ లాంగ్ జంప్ బాల్ త్రో లెమన్ స్పూను నిర్వహించాలన్నారు.

ఉన్నత పాఠశాల ఇంటర్మీడియట్ తరగతులకు చెందిన బాలురకు బ్యాడ్మింటన్ డబుల్ బాస్కెట్బాల్ ( జిల్లా స్థాయి) చదరంగం కబాడీ కోకో పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ వాలీబాల్ నిర్వహిం చాలన్నారు బాలికలకు బ్యాడ్మింటన్ డబుల్ ,బాస్కె ట్బాల్ (జిల్లా స్థాయి) చదరంగం కబాడీ కోకో పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ అథ్లెటిక్స్ నందు బాలురకు 100,200,800 మీటర్ల రన్, లాంగ్ జంపు నిర్వహించాలని బాలికలకు 100,200,400 మీటర్ల రన్ను లాంగ్ జంప్ షాట్ పుట్, హై జంపు నిర్వ హించాలన్నారు. ఈ క్రీడా పోటీలు శాంతియుత వాతావరణం లో సజావుగా నిర్వహించేందుకు అవస రమైన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఈ కార్య క్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి , డీఈవో సలీం భాష, సమగ్ర శిక్ష ఏపీసి జి మమ్మీ, స్కూల్ గేమ్స్ కార్యదర్శులు కే ఈశ్వరరావు, ఏఎస్ఎస్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
