పశు సంవర్ధక సహాయకులు పాడి పశువుల పెంపకంపై 3 రోజులు శిక్షణా తరగతులు

తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 23:

పశుసంవర్ధక శాఖ కార్య కలాపాలలో ఒక ముఖ్య భాగమైన, గ్రామ సచివాల య పశు సంవర్ధక సహాయకులు పాడి పశువుల పెంపకంపై శిక్షణల ద్వారా క్షుణ్ణంగా అవగాహన పెంపొందించుకొని నాణ్యమైన సేవలను అందించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక అమలాపురం పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఈనెల 23 నుండి 25వ తేదీ వరకు నిర్వహించనున్న పశు సంవర్ధక సచివాలయ సహాయకుల(ఏ హెచ్ ఏ) శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణలో మూలంగా సచివాలయ సహాయకులు నైపుణ్యాన్ని అలవర్చుకొని జిల్లాలో పాడి పరిశ్రమ అభి వృద్ధిలో తలమానికం, కీల కంగా వ్యవహరించాలన్నా రు. ఈ శిక్షణలు సిబ్బంది నైపుణ్యాభివృద్ధికి అన్ని విధాల ఉపకరిస్తాయ న్నారు పశువుల పెంపకం దారులకు నాణ్యమైన సేవలను అందించడానికి సచివాలయ పశు సహాయ కులు నైపుణ్యాలను పెంపొందించడానికి శిక్షణలు నిర్వహించడం జరుగుతోందన్నారు గ్రామ స్థాయిలో పశు ఆరోగ్య సంరక్షణ, రోగ నియంత్రణ, పాడి పశుసంవర్ధక ఉత్పత్తి విస్తరణలో ఉద్యోగుల పాత్ర ను బలపరుస్తుందన్నారు.

పశుసంవర్ధక సహాయ కులు రైతులకు మహిళా స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన సాంకేతిక, పరి జ్ఞానం అందించేందుకు కూడా శిక్షణ దోహదపడు తుందన్నారు. పశు ఆరోగ్య శిబిరాల నిర్వహణ ద్వారా పశు ఆరోగ్య పరీక్షలు, సాధారణ వ్యాధుల నిర్ధారణ,టీకాలువేయడo, కృత్రిమ గర్భాధారణ సాంకే తికత, పశు మేత ఉత్పత్తి, పాడి పశువుల ఆహార నిర్వహణ, పాలు స్వచ్ఛత నాణ్యత నిర్వహణ నేష నల్ లైవ్‌స్టాక్ మిషన్, పశు ఆరోగ్య బీమా, ఇతర కార్యక్రమాలు అమలు గూర్చి సంపూర్ణమైన అవగాహన కల్పించుకో వాలన్నారు .శిక్షణ అనం తరం పశుసంవర్ధక సహాయకులు గ్రామ సచివాలయ స్థాయిలో పశు రోగ నివారణ, మేత పంటల ప్రోత్సాహం, మరియు పశు సంక్షేమ పథకాల అమలు లో మరింత సమర్థవంతం గా సేవలు అందించేందుకు సర్వసన్నద్ధం కావాలన్నారు.


ఈ శిక్షణ కార్యక్రమాలలో వ్యక్తిత్వ వికాసం సాంకేతిక పరిజ్ఞానం పెంపుదల, కెపాసిటీ బిల్డింగ్ వంటి అంశాల పట్ల దిశానిర్దేశం . చేశారన్నారు.జీర్ణ మరియు జీవక్రియ రుగ్మతలు, విష ప్రయోగం, ప్రథమ చికిత్స మొదలైన వాటిపై సమగ్ర అవగాహన కల్పిం చార న్నారు.వ్యాధులు, టీకాలు, నులిపురుగుల నివారణ చికిత్స జంతు వుల పోషణ, దాణా, మేత, టోటల్ మిక్సర్ రేషన్, (టిఎమ్ఆర్) బ్యాలెన్స్ అంశాలపై అవగాహన పెంచారన్నారు. పశువుల పెంపకం ఏ హెచ్ ఏ ల పాత్రలు బాధ్యతలు, రైతు సేవ కేంద్రాలలో రికార్డు నిర్వహణ, అంశాలలో సమగ్రంగా తర్ఫీదును ఈ శిక్షణ కార్యక్రమాలలో పొందాలన్నారు ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఎస్ వెంకట్రావు, పశుసం వర్ధక శాఖ అధికారులు కర్నేడు మూర్తి సిబ్బంది వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

అమలాపురంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై పటిష్ట నిఘాతో పాటుగా డెకాయ్ ఆపరేషన్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం డిసెంబర్ 26:గర్భస్థ పిండ ఆరోగ్య పరిశీలన కొరకు వినియోగించే ఆల్ట్రా స్కానింగ్ వైద్య పరీక్షలను లింగ నిర్ధారణకు దుర్వినియోగం కాకుండా అల్ట్రాసౌండ్ […]

అవార్డు గ్రహీత రాజేశ్వరికి ఘన సన్మానం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అంబాజీపేట సెప్టెంబర్ 06: క్రాఫ్ట్ టీచర్ రాజేశ్వరి ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు అందుకున్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం […]

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి…

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –రామచంద్రపురం, జూన్ 1,2025 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్… వైద్యం ఖర్చుల నిమిత్తం […]

గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటల నుండి ప్రారంభం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఏప్రిల్ 23 ఆంధ్రప్రదేశ్ గురుకులపాఠ శాలలో2025- 26 విద్యా సంవత్సరం 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25వ తేదీ […]