క్రిస్మస్ సందర్భంగా వాటికన్ పోప్ సందేశం ఆయుధాలను పక్కన పెట్టాలి.

బుధవారం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 25, 2024న వాటికన్ సిటీ నుంచి పోప్ ఫ్రాన్సిస్ క్రిస్మస్ సందేశం ఇచ్చారు. ఉక్రెయిన్, ఆఫ్రికా నుండి ఆసియా వరకు ఉన్న ప్రపంచ దేశాల ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆయుధాలను పక్కన పెట్టాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ఆయుధాల శబ్దాలను నిశ్శబ్దం చేయడానికి మరియు విభజన లను అధికమించడానికి ఈ పవిత్ర సంవత్సరం లో అన్ని దేశాల ప్రజలందరూ.. ధైర్యంగా ఉండాలని పోప్ ప్రకటించారు.