అంతర్వేది మినీ హార్బర్ అభివృద్ధి టూరిజం అభివృద్ధికై అడ్వెంచర్ బోటింగ్ యాక్టివిటీ కొరకు స్థల సేకరణ/కలెక్టర్ మహేష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -సఖినేటిపల్లి జూలై 18:

అంతర్వేది మినీ హార్బర్ అభివృద్ధి, టూరిజం అభివృద్ధికై అడ్వెంచర్ బోటింగ్ యాక్టివిటీ కొరకు స్థల సేకరణ కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం ఆయన అంత ర్వేది సముద్ర ముఖద్వారం వద్ద బోట్లో ప్రయాణించి మినీ ఫినిషింగ్ హార్బర్ కార్యకలాపాలను పరిశీ లించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మినీ ఫిషింగ్ హార్బర్ నిర్వహణకు రాష్ట్ర ప్రభు త్వం 14 మంది సభ్యులతో కూడిన నిర్వహణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

ఇటీవల కమిటీ సభ్యులతో ఏర్పా టుచేసిన సమావేశంలో పూర్తిస్థాయి హార్బర్ నిర్వహణకు మౌలిక వసతులు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని కమిటీ సభ్యులు సూచించడం జరిగిందని ఈ నేపథ్యంలో మినీ ఫిషింగ్ హార్బర్ ను క్షేత్రస్థాయిలో పరిశీలన అధ్యయనం చేయడానికి స్థానికంగా అధికారుల బృందంతో విచ్చేయడం జరిగిందన్నారు. మినీ ఫిషింగ్ హార్బర్ ద్వారా ఆక్షన్ హాలు అద్దెలు, ల్యాండింగ్ చార్జీలు ఇతరత్రా ఆదాయాలను పరిగణనలో తీసుకుని. నివేదిక రూపొందించడం జరిగిందని ఈ యొక్క ఆదాయ వనరుల ను పరిగణనలో తీసుకొని దశలవారీగా హార్బర్ కు పూర్తి స్థాయి వసతులను నిర్వహణ కమిటీ సభ్యుల సారధ్యంలో కల్పించడం జరుగుతుందన్నారు.

స్థాని కంగా మడ అడవులు పరి రక్షణ చర్యలను ఆయన బోట్లో పయనించి పరిశీ లించారు. తుఫాన్లు విపత్తులు ప్రభావాన్ని తగ్గించేందుకై ఈ మడ అడవుల పరిరక్షణ చ ర్యలను సమర్థవంతంగా బలోపేతం చేయాలని అటవీశాఖ అధికారులు ఆదేశించారు.

అంతర్వేది బోటింగ్ సర్వీసెస్ అధారిటీ వారు బోటింగ్ ఆక్టివిటీ కొరకు టెండర్లు వేసి ఉన్నా రని ఆ మేరకు స్థానికంగా సాధ్యసాద్యాలను బేరీజు వేస్తూ తదుపరి స్థల సేకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉంద న్నారు. అదేవిధంగా గోదావరి నదిలో బోటులో ప్రయాణిస్తూ లక్ష్మీనరసిం హస్వామి గుడి వెనుక బాగాన ఉన్నా రక్తతుల్య కాలువను పరిశీలించారు. దిండి పర్యాటక రిసార్ట్స్ నుండి బోటులో అంతర్వేది రక్తతుల్య కాలువ పర్యాట కులు భక్తులు చేరుకుని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేలా ఓటింగ్ యాక్టివిటీ పై అధ్యయనం చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.

అదేవిధంగా నరసాపురం నుండి కూడా పర్యాటకులు, భక్తులు అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేలా ఓటింగ్ యాక్టివిటీ కి కూడా ఆస్కారం ఏర్పడుతుంద న్నారు. అంతర్వేది పెర్రి పాయింట్లు ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానికంగా పేదల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీలో ఉన్న సమస్యల పైన రెవెన్యూ అధికారులతో చర్చించారు. స్థానికంగా ఉన్న గోదావరి రక్షణ రెవి ట్మెంట్ గోడ స్థితిగతులను ఆయన పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో కే మాధవి, పర్యాటక రంగ అభివృద్ధి శాఖ ప్రాంతీయ సంచాలకులు పవన్ కుమార్ జిల్లా పర్యా టక అధికారి అన్వర్, మత్స్య శాఖ సహాయ సంచాలకులు వర్ధన్, అటవీ రేంజ్ అధికారులు, అంత ర్వేది ఓటింగ్ సర్వీసెస్ కంపెనీ ప్రతినిధి పొన్నాల విజయ్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

వైజాగ్, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు సిగ్నల్

ఆంధ్రప్రదేశ్: వైజాగ్, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైజాగ్ లో మెట్రో ప్రాజెక్టులో ఫస్ట్ ఫేజ్ 46.23 కిలో మీటర్ల మేరకు 3 కారిడార్లను నిర్మించాలని నిర్ణయించింది. విజయవాడలో మొదటి […]

చలో గుంటూరు మాల సభా వేదిక పై ముగించిన పరిచయం

వర్గీకరణకు వ్యతిరేకంగా చలో గుంటూరు మాల మహా గర్జన సభా ప్రారంభం లో సభా వేదికపై ఆంధ్ర తెలంగాణ మాల మహానాడు నాయకులు మరియు మాజీ మంత్రులు పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులను పరిచయం చేశారు. […]

క్షయ వ్యాధి రహిత సమాజమే లక్ష్యం: రాజ కుమారి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 17: క్షయ వ్యాధి రహిత సమాజమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ పని చేయాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]

ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు.. సాయంత్రం నాలుగు నుంచి రాత్రి 8 వరకు రేషన్ తీసుకోవచ్చు.. మంత్రి వాసంశెట్టి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –రామచంద్రపురం/ కే గంగవరం,జూన్1 ,2025 చౌక ధరల దుకాణాలను పునః ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రతినెలా 1 నుంచి […]