V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మార్చి 03:
ఆంధ్రప్రదేశ్: ఉత్తరాంధ్ర టీచర్ MLCగా గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. గాదె శ్రీనివాసులుకు రఘువర్మ ఆల్‌ది బెస్ట్ చెప్పారు.రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలిచిన గాదె శ్రీనివాసులు,టీచర్ల తీర్పును శిరసావహిస్తా-APTF అభ్యర్థి రఘువర్మ అన్నారు, కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడుతుంది.కౌంటింగ్ కేంద్రం నుంచి APTF అభ్యర్థి రఘువర్మ వెళ్లిపోయారు.
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. కూటమి బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మపై ఆయన రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ ఎమ్మెల్సీ స్థానంలో ఎనిమిది మందిని ఎలిమినేట్ చేసిన అధికారులు.. కాసేపట్లో విజేతను అధికారికంగా ప్రకటించనున్నారు.