చంద్రబాబు పవన్ కళ్యాణ్ గార్లు నా కుటుంబానికి న్యాయం చేయండి: నక్క వెంకట్రావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి డిసెంబర్ 24:చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నా కుటుంబాన్ని కి న్యాయం చేయండి. అంటూ దళితుడు నక్క వెంకట్రావు కన్నీరు కార్చాడు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధి లో ఉన్న కోటిపల్లి నర్సాపురం రైల్వే మార్గం సుమారు 26 సంవత్సరాల క్రితం సర్వే చేసి హద్దులుకు రాళ్లు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో కోటిపల్లి,బోడసకుర్రు, చించినాడ గోదావరి నదులపై వంతెనలకు ఫిల్లర్లు మాత్రమే నిర్మించారు. అయితే ఈరోజు మంగళవారం అయినవిల్లి మండలం శానపల్లిలంక గుంట్రువారి పేట దళిత గ్రామంలో నక్క వెంకట్రావు V9ప్రజా ఆయుధం మీడియా ముందు తన బాధను వ్యక్తపరుస్తూ కన్నీరు కార్చారు. 26 సంవత్సరాల క్రితం సర్వే చేసి రాళ్లు పాతి ఇడిచి పెట్టారని, 20 కొబ్బరి చెట్లు, డాబా ఇల్లు ముందే తొలగించారని, తర్వాత ఇప్పుడు రెండు కొబ్బరి చెట్లు ప్రస్తుతం తలదాచుకుంటున్న రేకు షెడ్ ను రైల్వే అధికారులు తొలగిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు దళితుడైన నక్క వెంకట్రావు కన్నీరు కారుస్తూ తన బాధను వెళ్ళగక్కరు.నేను రైల్వే మార్గానికి అడ్డు కాదని నాకు ప్రత్యామ్నాయంగా ఆర్థికంగా ఆదుకోవాలని కుటుంబ సభ్యులతో ఆయన కోరారు.