
ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 10:
ఈనెల ఆగస్టు 11వ తేదీ సోమవారం స్థానిక కలెక్టరేట్లోనీ గోదావరి భవన్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పిజిఆర్ఎస్ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా డివిజన్ మునిసిపల్ మండల స్థాయిలలో పిజిఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున అర్జీదారులు ఆ యొక్క స్థాయి లలోని పిజిఆర్ఎస్ సంబంధిత సమస్యలను ఆయా స్థాయి అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కార మార్గాలు కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాల్సిందిగా ఆయన ప్రకటనలో కోరారు.