ఎమ్మెల్సీ కూటమి అభ్యర్ధి గెలుపు కోరుతూ ఎంపీ ఎమ్మెల్యే విస్తృత ప్రచారం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట ఫిబ్రవరి 22:రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖర్ విజయం కోరుతూ అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధూర్ , రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అబ్జర్వర్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రాజాన రమేష్ తో కలసి ప్రచారం నిర్వహించారు. మండపేట మండలం ఏడిద గ్రామంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సచివాలయాలు, హైస్కూల్, గ్రామంలో ఉన్న పట్టభద్రులను కలసి ఓట్లు అభ్యర్ధించారు. ఈనెల 27న నిర్వహించనున్న ఎన్నికల్లో కూటమి బలపరచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితర్లు పాల్గొన్నారు.

Related Articles

నిరుపేదలకు వైద్యం అందించటమే కోనసీమ కేర్ హాస్పిటల్ లక్ష్యం: డాక్టర్ కారెం రవితేజ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-ఉప్పలగుప్తం డిసెంబర్ 30 నిరుపేదలకు వైద్యం అందించడం కోసం మే అమలాపురంలో కోనసీమ కేర్ ఆసుపత్రి నిర్మించడం జరిగిందని చల్లపల్లి గ్రామంలో డాక్టర్ కారెం రవితేజ […]

బుధవారం అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు పర్యటన షెడ్యూల్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం సెప్టెంబర్ 30:

సాంస్కృతి సాంప్రదా యాల కలయికే తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 10: సాంస్కృతి సాంప్రదా యాల కలయికే తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి అని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు […]

అమలాపురం కిమ్స్ ఆసుపత్రి ఆవరణలో యోగాంధ్రా/ పాల్గొన్న ఎంపీ హరీష్

యోగాంధ్రా తో ప్రపంచం చూపు ఆంధ్రా వైపు… మార్క్ పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిట్టా : ఎంపీ హరీష్ బాలయోగి V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 21: […]