V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – డిసెంబర్ 24: మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది.

కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి,డాక్టర్ అంబేద్కర్ ను గౌరవించాలి,అమిత్ షా రాజీనామా చేయాలి అనే నినాదాలు అమలాపురం లో మంగళవారం మారుమోగాయి. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా రాజీనామా చేయాలి అనే నినాదాలుతో కలెక్టరేట్ ను ముట్టడించారు.ఈ కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కలెక్టరేట్ కు ర్యాలీగా వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమిత్ షా ను భర్తరఫ్ చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.