సంపద సృష్టిస్తాం అని వాడ ల బెల్ట్ షాపులు: తోట

సంపద సృష్టిస్తామని నడ్డి విరిచారు…వాడ వాడ ల బెల్ట్ షాపులు…మద్యం వ్యాపారం లో 20 శాతం కమిషన్లు…
ఇసుక దోపిడీ…రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు…
కూటమి ప్రభుత్వం పై తోట త్రిమూర్తులు ధ్వజం : v9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు.
సంపద సృష్టిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికి ఇపుడు అన్ని చార్జీలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజక వర్గ వైసిపి ఇన్ ఛార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ద్వజమెత్తారు. ఆయన ఆద్వర్యంలో మండపేట విజయలక్ష్మి నగర్ లో వైసిపి కార్యలయం వద్ద మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.తొలుత రాజరత్న సెంటర్ లోని దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహం కు పుల మాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కార్యలయం వద్ద చైర్ పర్సన్ పతి వాడ నూక దుర్గా రాణి,వైసిపి నేతలు రెడ్డి రాధాకృష్ణ, వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, కర్రీ పాపా రాయుడు, బురిగా ఆశీర్వాదం ల సమక్షం లో కేక్ కట్ చేశారు.అభిమానులు నియోజకవర్గ నలుమూల నుండి భారీ సంఖ్యలో తరలి వచ్చారు.ఈ సందర్భం గా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మద్యం షాపుల్లో ప్రజా ప్రతినిధులు జోక్యం ఉండదని చెప్పారన్నారు. దీనికి విరుద్ధంగా వాడ వాడ ల బెల్ట్ షాపులు వెలిసాయని విమర్శించారు.మద్యం వ్యాపారం లో 20 శాతం కమిషన్లు ప్రతినిధులు గుంజు తున్నారని ఆరోపించారు. మండపేట మునిసిపల్ కార్యలయం కు కుత వేటు దూరం లో మద్యం షాప్ ఏర్పాటు చేశారన్నారు.జగన్ హయంలో ఎక్కడో దూరంగా వుండే మద్యం షాపులను గుడి,బడి, చర్చి ల వద్ద చేర్చారని ఎద్దేవా చేశారు.
ఇసుక దోపిడీ భారీ గా వుందన్నారు. ప్రభుత్వ చెప్పిన తరహా లో రు 16 వందలు మాత్రమే ఖర్చు అవుతుందని కపిలేశ్వరపురం తాత పూడి ర్యాంపు ల్లో రూ 6 వేలు నుండి ఏడు వేలు వసూలు చేస్తూ దోపిడీ చేస్తూన్నారని ద్వజమెత్తారు.విద్యుత్ చార్జీలు విపరీతం గా పెంచారని దుయ్యబట్టారు. వచ్చే నెల ఒకటి నుండి భూములు, ఆస్తులు
రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుతున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వ అరాచకాలు భారిద్దమని చెప్పారు. మండపేట నియోజక వర్గంలో కార్యకర్తలు అందరూ ఐక్యంగా ఉండి ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. వైసీపీ కార్యకర్తలంతా తన కుటుంబ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపిపి వుండమట్ల వాసు, వైసీపీ నాయకులు గారపాటి అశోక్, పిల్లా వీరబాబు, పలివేల సుధాకర్, పెంకే గంగాధర్, పెంకే వెంకట్రావు, సాధనల శివ భగవాన్, వల్లూరి రామకృష్ణ, ముక్కా దలీయ్య,మహంతి అసిరి నాయుడు, శెట్టి నాగేశ్వరరావు, జెడ్పీటీసీ లు, ఎంపిపి లు, సర్పంచ్ లు,వార్డు మెంబర్ లు కౌన్సిలర్ లు నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

సోషల్ మీడియాపై కఠినమైన చర్యలు:డిఎస్పి మురళీమోహన్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు రాజోలు ఫిబ్రవరి 20: సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తప్పవని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట […]

మరి కొద్దిసేపట్లో కేటీఆర్ అరెస్ట్ అవుతారా?

ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్కు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. నేడే కేటీఆర్ను అరెస్టు చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. తెలంగాణ భవన్ వద్ద భారీగా […]

లిడియా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రావులపాలెంలో క్రిస్మస్ వేడుక.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రావులపాలెం డిసెంబర్ 18: ఆంధ్ర యూనివర్సిటీ అనుబంధం లిడియా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రావులపాలెం లో బుధవారం రాత్రి ఘనంగా క్రిస్మస్ వేడుకలు మేనేజ్మెంట్ […]

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణిరెండు రోజుల్లో బలపడి వాయుగుండంగా మారనున్న ద్రోణిపశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ..తమిళనాడు తీరం వైపు పయనిస్తున్న అల్పపీడనంమూడు రోజుల పాటు ఏపీ, తమిళనాడుకు వర్ష సూచనమోస్తరు నుంచి […]