V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రావులపాలెం డిసెంబర్ 18:
ఆంధ్ర యూనివర్సిటీ అనుబంధం లిడియా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రావులపాలెం లో బుధవారం రాత్రి ఘనంగా క్రిస్మస్ వేడుకలు మేనేజ్మెంట్ డైరెక్టర్ గొల్లపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు హాజరయ్యారు.ఆయన ఈ సందర్భంగా క్రీస్తును గూర్చి క్రిస్మస్ సందేశం అద్భుతమైన రీతిలో ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలేజీ అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు