జగన్ కు సీఎం చంద్రబాబు బర్త్ డే విషెస్
సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సీఎం చంద్రబాబు బర్త్ డే విషెస్ చెప్పారు. “మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వైఎస్ జగన్ గారు. మీకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు పొందాలని కోరుకుంటున్నా” అని ట్వీట్ చేశారు. తన రాజకీయ ప్రత్యర్థికి చంద్రబాబు విషెస్ చెప్పడంతో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా, గతేడాది కూడా జగన్ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.