
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు రాజోలు ఫిబ్రవరి 20: సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తప్పవని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సబ్ -డివిజన్ పోలీస్ ఆఫీసర్ మురళీమోహన్ పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా ఎస్పీ కృష్ణారావు ఐపిఎస్ ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ ప్రసాద్ పర్యవేక్షణలో గురువారం డి.ఎస్.పి మురళీమోహన్ ఆధ్వర్యంలో పోలీస్ సర్కిల్ రాజోలు చైతన్య కాలేజీ విద్యార్థులతో సోషల్ మీడియా పై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ… అవగాహన లేకుండా మానవ హక్కులను భంగం కల్పించే విధంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన, పోస్ట్ లు పెడితే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని విద్యార్థులతో సున్నితమైన రీతిలో ఆయన హెచ్చరిస్తూ మాట్లాడారు. నేటి విద్యార్థులే రేపటి భవిష్యత్తుకు బాటలు అన్నారు. నేడు సమాజానికి వ్యతిరేకంగా జరుగుతున్న కొన్ని సంఘటనలు ఉదాహరణకు చూపిస్తూ..విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. శాంతి భద్రతలకు భంగం కలిపించే విధంగా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తప్పవు అన్నారు.ఈ కార్యక్రమంలో కాలేజీ యాజమాన్య సిబ్బంది, సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ మరియు సబ్ ఇన్స్పెక్టర్లు రాజేష్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.