

తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం అక్టోబర్ 17:

అమలాపురం నియోజకవర్గం శాసనసభ్యుడు అయితాబత్తుల ఆనందరావు శుక్రవారం పలు ప్రజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ప్రధాన పట్టణముగా ఉన్న అమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పలు కార్యక్రమాలలో విడి విడిగా పాల్గొని బిజీబిజీగా గడిపారు. మొదటగా అమలాపురం నాయి బ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ హాలు ప్రారంభించి వారి సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడి కమ్యూనిటీ శ్రేయస్సు కొరకు పనిచేస్తానని భరోసా ఇచ్చారు.అదేవిధంగా అమలాపురం ఈదరపల్లి గ్రామంలో రెండు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న షెడ్యూల్ కులాలు కమ్యూనిటీ హాల్ భవన పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కాంట్రాక్టర్ కు,పలు సూచనలు సలహా ఇచ్చారు.అనంతరం నడిపూడి బైపాస్ వంతెన రోడ్డు పనులు పరివేక్షించారు.త్వరగా పనులు పూర్తయ్యే విధంగా ముందుకు వెళ్లాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

పక్క గ్రామం పాలగుమ్మిలో దేవాలయ పనులకు శంకుస్థాపన చేశారు.తదుపరి రోడ్డు ప్రమాదంలో మరణించిన పాలగుమ్మి గ్రామానికి చెందిన దేవగుప్తపు వీర వినయ్ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ద్వారా మంజూరు అయిన భీమా ఐదు లక్షల రూపాయల నగదు పత్రాలను ఆయన చేతుల మీదగా అందజేశారు.

ఇదే క్రమంలో అమలాపురం పట్టణ ప్రాంతం అయిన సావరం వార్డు నందు కర్రి వారి ఆహ్వానం మేరకు గృహప్రవేశానికి హాజరై ,కుటుంబ సభ్యులకు శాసనసభ్యులు ఆనందరావు శుభాకాంక్షలు తెలిపారు. మధ్యాహ్నం భోజనం అనంతరం అమలాపురం నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో రాత్రి వరకు ప్రజా సమస్యలపై వచ్చిన వారందరితో ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడి సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మీకు ఎలాంటి కష్ట మొచ్చిన నా దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కోరుతూ… పేదలందరూ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్య సేవలు వినియోగించుకోవాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దివంగత నేత మెట్ల సత్యనారాయణ కుమారుడు మరియు రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, నల్లా స్వామి, చిక్కాల గణేష్, అశెట్టి ఆదిబాబు, గొల్లకోటి చిన్న, పుల్లయ్య నాయుడు, కుంచె రమేష్, బుడితి రాజు తదితరులు పాల్గొన్నారు.