
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం సెప్టెంబర్ 14:

డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన గన్నమని ఆనందరావు శత జయంతి వేడుకలకు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి హాజరయ్యారు.మంత్రి కందుల గుర్గేష్,తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు,గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు,మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు,పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం,మాజీ ఎమ్మెల్సీ వి వి వి చౌదరి,సర్పంచ్ సాకా శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన గన్నమని ఆనందరావు విగ్రహ ఆవిష్కరణ చేశారు.మరియు ఆనందరావు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఎస్ ఎస్ జెడ్ పి హైస్కూల్ లో ఆనందరావు కంప్యూటర్ ల్యాబ్ ను,కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో 2D ECHO,థైరాయిడ్ మెషీన్ మరియు ఇతర పరికరాలను ప్రారంభించారు.అలాగే గ్రామంలో ఎంపీ నిధుల నుండి ఏర్పాటు చేస్తున్న శ్మశానవాటిక శిలా ఫలకం ఆవిష్కరణ చేశారు.అనంతరం ఆనందరావు శతజయంతి వేడుకల సభలో పాల్గొని ఆయన చేసిన సేవలను కొనియాడారు.