

తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 18:

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర- స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా (నేడు) మూడో శనివారం స్వచ్ఛ మైన గాలి ఇతివృత్త కార్యక్రమాలు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా నిర్వహించి విజయవంతం గావించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు.

శనివారం స్థానిక కొంకాపల్లి జవహర్లాల్ నెహ్రూ పురపాలక సంఘ ఉన్నత పాఠశాల నందు స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా మొక్క లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కొంకాపల్లి హైస్కూల్ నుండి ఎస్ కే బి ఆర్ డిగ్రీ కళాశాల వరకు వాహనాల కాలుష్యం నివారించాలనే నినాదంతో సైకిల్ ర్యాలీని స్థానిక శాసన సభ్యులు, అయితాబత్తుల ఆనందరావు, మున్సిపల్ జిల్లా కలెక్టర్ మున్సిపల్ చైర్ పర్సన్ మున్సిపల్ కమిషనర్ ,అముడా చైర్మన్ లు నిర్వహించారు.

ఈ సైకిల్ ర్యాలీని అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు హై స్కూల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్రలో భాగంగా స్వచ్ఛమైన గాలి ఇతివృ త్తంతో చేపట్టి విజయ వంతం చేశార న్నారు అధి కారులు, సిబ్బంది ఇదే బాటలో నడిచి భావి తరాలకు భవిష్యత్తు లో స్వచ్ఛమైన గాలి రూపంలో వెలకట్టలేని సంపదను బహుమతిగా అందించ డంలో భాగస్వా ములు కావాలని కోరారు.

క్లీన్ ఎయిర్ స్వచ్ఛమైన గాలి ఇతివృత్తంతో గాలి కాలుష్య కారకాలకు అడ్డుకట్ట వేస్తూ. హరిత విస్తీర్ణం పెంచడం ద్వారా స్వచ్ఛ మైన గాలిని ఐశ్వ ర్యంగా పొందవచ్చని సూచించారు. వివిధ పరిశ్రమల ఆక్వా చెరువు నుంచి కాలుష్యం వెదజ ల్లకుండా నియంత్రిస్తూ గ్రీన్ ఎనర్జీ చర్యలు బలోపేతం చేయాలని, సౌర విద్యు త్తు వినియోగం వంటి వాటిని ప్రోత్సహించాల న్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర,మణి, మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.