
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 29:
ఉదయం 8.00 నుండి 12.00 గంటల వరకు నుండి సా. 4.00 గంటల నుండి 8.00 గంటల వరకు
రేషన్ సరుకుల పంపిణీలో నిబంధనలకు లోబడి రేషన్ సరు కులను వినియోగదారు లకు సరఫరా చేయాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పౌరసరఫరాల అధికారి ఏ ఉదయ భాస్కర్ రేషన్ షాపు డీలర్లకు గురువారం ఒక ప్రకటన ద్వారా సూచిం చారు జూన్ 1వ తేదీ నుంచి ప్రజా పంపిణీ విధానం ద్వారా పంపిణీ చేసే నిత్యావసర వస్తువు లను చౌక దుకాణాల ద్వారానే పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజు ప్రభుత్వం వారు నిర్దేశించిన సమయాల్లో ఉదయం 8.00 నుండి 12.00 గంటల వరకు నుండి సా. 4.00 గంటల నుండి 8.00 గంటల వరకు చౌక ధరల దుకాణాలను తెరిచి ఉంచాలని రేషన్ డీలర్లను ఆదేశించారు. చౌక ధరల దుకాణాల పని వేళలు ధరలు, సరుకు నిల్వను సూచించే బోర్డును షాప్ ముందు భాగంలో తప్పని సరిగా ప్రదర్శించాలన్నారు.. 65 సంవత్సరాలుపైబడిన వారికి, దివ్యాంగులు వారి ఇంటి వద్దకే వెళ్లి రేషన్ పంపిణీ చేయాలన్నారు. చౌక ధరల దుకాణాల పరిస రాలను పరి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ పాస్, వేయింగ్ మిషన్లు కండి షన్లో ఉంచుకోని కార్డు దారులందరికి ఖచ్చిత మైన కొలతలు తూకంతో నిత్యా వసర వస్తువులను పంపిణీ చేసి రశీదును కూడా ఇవ్వా లని సూ చించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఇక మీదట నిత్యావసర వస్తు వులు రేషన్ షాపుల ద్వా రానే పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఈ యొక్క సమాచారాన్ని రేషన్ కార్డు దారులందరు గమనించాలని, డీలర్లు కూడా ఈ విషయాన్ని ప్రతి కార్డు హోల్డర్ కుటుం బానికి తెలియజేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి ఆ ప్రకటనలో కోరారు.
రేషన్ కార్డులలో మార్పు, చేర్పులకు అవకాశాన్ని కల్పించే దిశగా ఆన్లైన్ విధానాన్ని ప్రభుత్వం తీసుకుని వచ్చిందని డీఎస్ఓ ఉదయభాస్కర్ తెలిపారు రైస్ కార్డులలో మార్పులు, చేర్పులను గ్రామ, వార్డు సచివాల యాల ద్వారా చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభు త్వం కల్పించిందని, ఈ అవకాశాన్ని రేషన్ కార్డు దారులు సద్వినియోగం చేసుకొన్నారు రైస్ కార్డులకు సంబంధించి కొత్త బియ్యం కార్డు పొందుటకు,బియ్యం కార్డు విభజన, సాధారణ విభజన, వితంతువు విభజన, విడాకుల విభజన సింగిల్ మెంబర్ స్పిట్, వివాహ విభజన బియ్యం కార్డులో కొత్తగా సభ్యుల చేరిక బియ్యం కార్డులో సభ్యుల తొల గింపు,తప్పు ఆధార్
సీడింగ్ యొక్క దిద్దు బాటు బియ్యం కార్డులో చిరునామా మార్పు , బియ్యం కార్డు సరెండర్ వంటి సేవలు మీ సమీపం లోని గ్రామ వార్డు సచివా లయంలో పొంద వచ్చు నని పేర్కొన్నారు. పై సేవలు అందించేందుకు ఎటువం టి కాలపరిమితి విధించ లేదనీ, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని డీఎస్ఓ తెలియచేశారు. కావున ఈ అవకాశాన్ని జిల్లాలో అర్హత కలిగిన లబ్దిదారులు సద్విని యోగం చేసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు..