

తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రాయవరం, అక్టోబర్ 17:

బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటనపై అన్ని కోణాల నుండి దర్యాప్తు జరుగు తోందని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ద్విసభ్య కమిటీ సభ్యులు, పురపాలక పట్ట ణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ తెలిపారు.

ఈనెల 8న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండల పరిధిలోని సావరం శివారు గణపతి గ్రాండ్ ఫైర్‌వర్క్స్ వద్ద జరిగిన బాణాసంచా పేలుడు ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిటీ, ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, ఈగల్ ఐజీ ఆర్.కె. రవి కృష్ణ శుక్రవారం సంఘటన స్థలాన్ని సందర్శించి స్థానిక నిర్వాహకులు అధికారులతో విచారణ చేపట్టారు.

వీరు రాయవరం ప్రాంతీయ రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక మరియు కార్మిక శాఖ అధికారులతో కలసి ప్రమాదానికి గల కారణాలపై సమగ్రంగా విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ, ఘటన జరిగిన వెంటనే నిర్వహిం చిన ప్రాథమిక విచారణ నివేదికలను పరి శీలించామని తెలిపారు.

స్థానిక అధికారులు బాణాసంచా తయారీ కేంద్రం సంబంధిత భద్రతా ప్రమాణాలు నిబంధ నలకు అనుగుణంగా ఉన్నాయా అనే అంశంపై సంయుక్త తని ఖీలు జరిపి, తగిన లైసెన్సులు మరియు “నో అబ్జెక్షన్ సర్టిఫికేట్” (NOC) గత సెప్టెంబర్ మాసంలోనే జారీ చేసినట్లు పేర్కొన్నారు. అయితే, బాణాసంచా తయారీ ప్రక్రియలో భద్రతా నిబంధనలను పూర్తిగా పాటించారా లేదా అన్న విష యంలో కొన్ని అను మానాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

పేలుడు ఘటనకు సంబంధిం చిన ఫోరెన్సిక్ నివేదిక ఇంకా రావలసి ఉందని, ఆ నివేదిక లభిస్తే ఘటనకు గల అసలు కారణాలు స్పష్టమవు తాయని సురేష్ కుమార్ తెలిపారు. ఈ సంఘటనలో మృతి చెందిన బాధితుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తగిన నష్టప రిహారం అంది స్తుందన్నారు. విచారణ పూర్తయిన తర్వాత నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించ నున్నట్లు ఆయన పేర్కొ న్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రాహుల్ మీనా, ఆర్డీఓ డి. అఖిల, జిల్లా అగ్నిమాపక మరియు విపత్తు నిర్వహణ అధికారి పార్థసారథి, తహసీల్దార్ ఎస్.బి. భాస్కర్, సహాయ కార్మిక కమిషనర్ టీ. నాగలక్ష్మి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
