‘సూర్యఘర్’ పథకం సోలార్ విద్యుత్ ప్లాంట్ల సంస్థాపన: కలెక్టర్ మహేష్ కుమార్

తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 17:

పురపాలక సంఘాలలో ‘సూర్యఘర్’ పథకంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ల సంస్థాపన ద్వారా విద్యుత్ చార్జీలు గణనీయంగా తగ్గి, స్థానిక సంస్థలు ఆర్థికంగా బలపడతాయని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన అమలాపురం నడిపూడి సమ్మర్ స్టోరేజ్ చెరువు వద్ద ప్రతిపాదిత సోలార్ ప్లాంట్ స్థలాన్ని మున్సిపల్, విద్యుత్ అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్థానిక సంస్థలకు ఆర్థిక సౌలభ్యం కలిగించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు సౌర విద్యుత్ దోహదపడు తుందని చెప్పారు. సూర్య ఘర్ పథకం ద్వారా సోలార్ యూనిట్లు అమలు చేస్తే నెలవారీ విద్యుత్ బిల్లులు ఎక్కువగా తగ్గుతాయని, అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించే అవకాశం ఉండి ఆదాయం కూడ సాధ్యమ వుతుందని వివరించారు.

కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని, అందువల్ల ప్రారంభ పెట్టుబడి భారం తక్కువవుతుందని తెలిపారు. సోలార్ ప్లాంట్లు 20–25 సంవత్సరాల ఆయుష్షు కలిగి తక్కువ నిర్వహణతో పనిచేస్తాయని చెప్పారు.మున్సిపల్ కార్యా లయాలు, వీధి విద్యుత్, ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్ వినియోగించడం ద్వారా వార్షిక విద్యుత్ ఖర్చులను భారీగా తగ్గించుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

వేగవంతమైన అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా సబ్సిడీలు మరియు బ్యాంకు రుణాలు అందు బాటులో ఉన్నాయని తెలిపారు.నీటి పంపులు, డ్రైనేజ్ వ్యవస్థలు, మరియు నీటి సరఫరా వంటి కీలక సేవలకూ సోలార్ శక్తి వినియోగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీని ద్వారా విద్యుత్ సరఫరా అంతరాయాలు తగ్గి, కాలుష్య నిరోధం, ఆర్థిక స్థిరత్వం, మరియు పర్యావరణ హిత అభివృ ద్ధికి మార్గం సుగమమవు తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వి. నిర్మల్ కుమార్ మాట్లాడుతూ, సోలార్ ప్లాంట్ల సంస్థాపన పురపాలక సంఘాలకు విద్యుత్ ఖర్చులలో భారీ ఉపశమనాన్ని ఇస్తుందని చెప్పారు. పర్యావరణ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఈ చర్య లాభదాయకమని అన్నారు. గ్రీన్ సిటీస్ మరియు స్మార్ట్ సిటీస్ లక్ష్యాలను చేరుకోవడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఏపీ ఈపీడీసీఎల్ సూపరిం టెండెంట్ ఇంజనీర్ బి. రాజేశ్వరి, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

చలో గుంటూరు మాల మహానాడు బహిరంగ సభలో మాల కళాకారులు.

V9 ప్రజా ఆయుధం- గుంటూరు డిసెంబర్ 15:గుంటూరు నల్లపాడు లో ఆదివారం సాయంత్రం చలో గుంటూరు మాల మహానాడు బహిరంగ సభ ప్రారంభమైంది. సభా వేదికపై మాల కళాకారులు మాలలను చైతన్య పరుస్తూ జానపద […]

హోటల్స్ ఆహార కల్తీ, ఆహార తయారీలో నాణ్యత ప్రమాణాలు లేవు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 07: హోటల్స్ ఆహార కల్తీ, ఆహార తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించక పోవడం వంటి సమస్యలు ప్రజారోగ్యం మీద తీవ్ర ప్రభా […]

అమలాపురం ఏరియా ఆసుపత్రి లో జాయింట్ కలెక్టర్ హెచ్చరిక జారీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం సెప్టెంబరు 22 : హాజరు పట్టిలో సంతకాలు పెట్టి విధులకు గైహాజరు అయిన వైద్యులు వైద్య సిబ్బందిపై క్రమ శిక్షణ చర్యలు గైకొనడం జరుగు […]

తొండవరం గ్రామంలో సుపరిపాలన ప్రచార కార్యక్రమంలో ఎంపీ హరీష్ బాలయోగి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అంబాజీపేట జూలై 03: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం తొండవరం గ్రామంలో సుపరిపాలనలో […]