డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలందరికీ అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందు గా తెలియచేశారు.2025 నూతన సంవత్సరంలో ప్రజలందరికీ శుభం జరగాలని, ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను, భోగభాగ్యాలను మరియు అద్భుత విజయాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు శ్రీమతి చింతా అనురాధ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు.

కోనసీమ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ బావుండాలని, ఇక్కడి పేదలకు సకల సౌకర్యాలు అంది వారి పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలన్నదే తన ఆశయం అని చింతా అనురాధ పేర్కొన్నారు.
పదవి ఉన్నా లేకున్నా, తాను ప్రజలకు సేవ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని అనురాధ ఈ సందర్భంగా ప్రకటించారు.