
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అంబాజీపేట జనవరి 28:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా పరిశ్రమల కేంద్రం రాయి తీతో కోనసీమ జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్ర మలు స్థాపనకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను కోరారు. మంగళవారం మండల పరిధిలోని నేదునూరు గ్రామంలో కృషివల కొబ్బరి రైతుల ఉత్పత్తి దారుల కంపెనీని ఆయన సందర్శించి తయారయ్యే ఉత్పత్తులను గూర్చి నిర్వాహకులు కంపెనీ కి సంబంధించిన కార్యనిర్వ హణాధికారి గోపాలకృష్ణ ను అడిగి తెలుసుకున్నారు పరిశ్రమలో ఐదు కేజీలు క్వాయర్ బ్రిక్స్ తయారీ, ఫైబర్ సేకరణ, వర్మీ కంపోస్ట్ తయారీ, హైటెక్ నర్సరీ యూనిట్ల ను ఆయన పరిశీలించారు. కొబ్బరికాయ వలుపు దగ్గర నుండి డొక్కల నుండి పీచు పొట్టు తయారీ విధివిధా నాలను ఆయన సంపూ ర్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు జైక పరిశ్రమ నుండి రావలసిన నిధులను ఇప్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు.

ఈ యొక్క యూనిట్ను రైతు ఉత్పత్తిదారుల సంఘాలు సమిష్టిగా మరింత పురోగ మించే విధంగా ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లా పరిశ్రమల కేంద్రంలో అమలు చేయబడుతున్న స్ఫూర్తి పథకం ద్వారా సుమారు 5 కోట్ల అంచనా వ్యయంతో ఈ కొబ్బరి ముడిసరుకుతో తయార వుతున్న ఉత్ప త్తుల పరిశ్రమ నెలకొల్ప బడిందని జిల్లా ఉద్యాన అధికారి బివి రమణ జిల్లా కలెక్టర్ వారికి వివరిం చారు ఈ పెట్టుబడి వ్యయం లో 90 శాతం రాయితీని జిల్లా పరి శ్రమల కేంద్రం అందిం చిందని తెలిపారు మొక్కల పెంపకానికి మట్టిని ఉప యోగించకుండా ఈ యొక్క కొబ్బరిపొట్టుతో తయారు చేసిన ఇటుకలను దుబాయ్ వంటి ప్రాంతాలలో మొక్కల పెంపకానికి మట్టికి బదులుగా ఇటుకలను వినియోగిస్తారని ఆయన తెలిపారు ఈ ఇటు కల ఎగుమతికి మంచి డిమాండ్ ఉందన్నారు. జియో టెక్స్టైల్ మ్యాట్లు ను రోడ్ల నిర్మాణంలో లేయర్ల మధ్య పటిష్టతకు బలోపేతానికి వినియోగిస్తారన్నారు, కొబ్బరి తాళ్లు బొమ్మల తయారీకి స్థానికంగా ముడిసరుకు లభ్యమవుతుందన్నారు ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుమ్మడి ప్రసాద్ కోబ్బరి రైతుల ఉత్పత్తిదారుల కంపెనీ చైర్మన్ గణపతి వీర రాఘవులు, డొక్కా ఆది నారాయణ ముత్యాల జమీలు పరిశ్రమల కేంద్రం ప్రతినిధి మాధవి, స్థాని క పంచాయితీ అధ్యక్షులు ప్రసాద్ రైతు ఉత్పత్తి దారుల సంఘాల సభ్యులు తది తరులు పాల్గొన్నారు.