
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అంబాజీపేట జూలై 03:

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం తొండవరం గ్రామంలో సుపరిపాలనలో తొలిఅడుగు ప్రచార కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి పాల్గొన్నారు.పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం,నియోజకవర్గ కో కన్వీనర్ మోకా ఆనందసాగర్ లతో కలసి ఇంటింటా కరపత్రాలను పంపిణీ చేసి ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీష్ ప్రజలతో మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో గాని,అభివృద్ధిలో కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయా అని మరియు ప్రజలు ఏమైనా సలహాలు ఇస్తే తెలుసుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలుసుకోవడం కోవడమే కార్యక్రమ ఉద్దేశం అన్నారు.జగన్ అమ్మఒడి ఇంట్లో ఒకరికి మాత్రమే ఇచ్చారని కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు తల్లికి వందనం చెల్లించామన్నారు.హామీల అమలులో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేశామన్నారు.కేంద్ర ప్రభుత్వం వేసే డబ్బులతో పాటు రైతులకు అన్నదాత సుఖీభవ అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.ఆగస్టు నెల నుంచి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కూడా కల్పిస్తున్నామన్నారు.సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలకు సమపాలల్లో ప్రజలకు అందిస్తామని ఎంపీ హరీష్ తెలిపారు.