
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం డిసెంబర్ 26:గర్భస్థ పిండ ఆరోగ్య పరిశీలన కొరకు వినియోగించే ఆల్ట్రా స్కానింగ్ వైద్య పరీక్షలను లింగ నిర్ధారణకు దుర్వినియోగం కాకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై పటిష్ట నిఘాతో పాటుగా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆర్డీవో కె మాధవి తెలిపారు గురువారం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీవో అధ్యక్షతన అధ్యక్షతన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి డివిజన్ స్థాయి (పీసీ, పీఎన్ డీటీ) లింగ నిర్ధారణ నిషేధ చట్టం 1994 చట్టం అమలు తీరు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడ శిశువు పట్ల వివక్షతతో జరిగే భ్రూణ హత్యలను నివారించేందుకు ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపట్టడం జరిగిందని తదనుగుణంగా ఆల్ట్రాసౌండ్ వైద్య పరీక్షలు లింగ నిర్ధారణ కు ఉపయోగించుకోవడం చట్ట రీత్యా నేరమని, డివిజన్ స్థాయిలో ప్రభుత్వ నిబంధ నలకు విరుద్ధంగా లింగనిర్ధా రణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై డేకాయ్ ఆపరేషన్లు నిర్వహించి చట్ట ప్రకారం చర్యలు గైకొనాలని ఆమె కమిటీ సభ్యులకు సూచించారు. డివిజన్ స్థాయిలో గుర్తింపు పొందిన స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్లు, ఆకస్మిక తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహిం చాలన్నారు. కమిటీ సభ్యులు గ్రామస్థాయిలో కూడా అనధి కారికంగా జరుగుతున్న అబార్షన్లను గుర్తించి లింగ నిర్ధారణ నిషేధిత చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. స్కానింగ్ సెంటర్ల రెన్యువల్ నిమిత్తం డివిజన్ స్థాయి కమిటీ ఆమోదించిన దరఖా స్తులను జిల్లా స్థాయి కమిటీకి నివేదించాలని సూచించారు ప్రతి స్కానింగ్ సెంటర్ లోను చట్టానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను, వివరాలతో తప్పని సరిగా ప్రదర్శిస్తూ ఆడ పిల్లల పట్ల వివక్షతను పూర్తి గా రూపు మాపుతూ స్త్రీ పురుష లింగ నిష్పత్తి సమాన త్వ సాధన ద్వారా ఆరోగ్యకర సమాజ స్థాపనకు సమిష్టిగా పాటుపడాలన్నారు. స్వచ్ఛం ద సంస్థల సహకారంతో లింగనిర్థారణ నిషేధ చట్టం అమలు విధి విధానాలపై ప్రజల్లో పరిపూర్ణ అవగాహన పెంపొందించాలన్నారు. అదనపు డి ఎం అండ్ హెచ్ ఓ సి హెచ్ వి భరత లక్ష్మి ప్రసంగిస్తూ ఆడ శిశువుల పట్ల వివక్షత జరిగే ప్రాం తాలలో భ్రూణ హత్యలను నివారిం చడంతో పాటు డివిజన్ స్థాయిలో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, డెకా య్ ఆపరేషన్ నిర్వహించా లన్నారు. గర్భస్థ పిండ ఆరోగ్య పర్యవేక్షణకు సంబంధించిన పరీక్షలను లింగ నిర్ధారణకు దుర్విని యోగం కాకుండా అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లపై నిఘా ఉంచాలన్నారు. ఆల్ట్రా సౌండ్ వైద్య పరీక్షలు లింగ నిర్ధారణకు ఉపయోగించు కోవడం చట్ట రీత్యానేరమని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంద న్నారు. స్కానింగ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి లింగ వివక్షతకు తావు లేకుం డా చర్యలు చేపట్టాలన్నారు పిండ లింగ నిర్ధారణ చట్టంపై ప్రతి గ్రామ స్థాయిలో వైద్య ఆరోగ్యం, స్త్రీ శిశు సంక్షేమ, స్వచ్ఛంద సంస్థలను సమ న్వయం విస్తృత అవగాహన పెంపొందించాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రసూ తి వైద్య నిపుణులు డాక్టర్ మాధురి, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ పి వి పృధ్విరాజ్ రేడియాలజిస్ట్ డాక్టర్ భరత్ సిఐ వీరబాబు లీగల్ సెల్ ఎన్జీవోల ప్రతిని ధులు తదితరులు పాల్గొన్నా రు.