బాణాసంచా పేలుళ్లు మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి సుభాష్

రాయవరం,అక్టోబర్ 08 : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

అమరావతి నుంచి నేరుగా రాయవరం చేరుకున్న మంత్రిక్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలుబాణాసంచాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రాయవరం మండలం కొమరిపాలెంలో బుధవారం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన కుటుంబాలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఎస్ఐపిబి సమావేశానికి హాజరైన మంత్రి ఈ విచారకర సంఘటన విషయం తెలియగానే హుటాహుటిన బయలుదేరి రాయవరం చేరుకున్నారు.

అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తొలుత ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ తో చరవాణి ద్వారా మాట్లాడి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ బాణాసంచా పేలుడు సంఘటనలో ఏరుగురు మరణించడం తనను తీవ్రంగా కలచివేసింది అన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.

బాణాసంచా తయారీ కర్మాగారాలు కనీస ప్రమాణాలు పాటించాలన్నారు. భద్రత విషయంలో రాజీ పడకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ సంఘటనపై విచారణ జరిపించి అధికారుల నిర్లక్ష్యం ఉంటే తగు తీసుకుంటామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మంత్రినాయకులు సుభాష్ వెంట రామచంద్రపురం ఆర్డీవో అఖిల, డి.ఎస్.పి రఘువీర్, అగ్నిమాపక సిబ్బంది, కూటమి పార్టీ ఉండవిల్లి శివ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

ఆసుపత్రి వైద్య సేవలు,చెత్త నుండిసంపద:అమలాపురం వార్తలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఫిబ్రవరి 20: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ సేవలపై సంతృప్తి స్థాయిలను పర్యవేక్షించేందుకు వివిధ పథకాల అమలు కార్య క్రమాలు అమలుకు […]

బహిరంగ ఇసుక రీచ్ లు రేపటినుండే అమ్మకాలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 7: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 20 ఇసుక రీచ్ లలో రుతుప వనాలు సమీపిస్తున్నం దున ఈ నెల […]

మహిళా సంఘాలకు క్రెడిట్ ప్లాన్ పై శిక్షణ (అయినవిల్లి మండలం)

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి మార్చి 28: స్వయం సహాయక సంఘ సభ్యులకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో అవసరమైన జీవనోపాదులు మరియు ఋణాలు గూర్చి ఎంపిక చేసిన ఎన్యూ […]

41,366 గృహాలు మంజూరు||గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లను ఆదేశించిన కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 13 : పేదోళ్ల ఇంటికి భరోసాగా గృహ నిర్మాణ సంస్థ నిలిచి సొంత ఇంటి కలను సాకారం చేయాలని డాక్టర్ బి […]