V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి మార్చి 28:

స్వయం సహాయక సంఘ సభ్యులకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో అవసరమైన జీవనోపాదులు మరియు ఋణాలు గూర్చి ఎంపిక చేసిన ఎన్యూ మరేటర్లకు శిక్షణ ఇస్తున్నట్లు వెలుగు సెర్ప్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండల ఎ పిఎం ఎమ్. వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక పి.గన్నవరంఅయినవిల్లి మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో గత రెండు రోజుల నుండి గ్రామ సమాఖ్య సహాయకరాలు మరియు ఎన్యూమరేటర్ లకు శిక్షణ జరుగుతుంది. మండలంలో ఉన్న డ్వాక్రా సంఘాలను ఒక యూనిట్ గా తీసుకొని ప్రతి ఐదు సంఘాలకు చదువుకున్న ఎన్యూమరేటర్ లను గుర్తించడం జరిగిందన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏడవ తేదీ వరకు క్షేత్రస్థాయిలో సంఘ సభ్యుల వద్దకు వెళ్లి మొబైల్ యాప్ ద్వారా కుటుంబ అవసరాలకు కావలసిన ఋణ ప్రణాళిక తయారు చేయడం జరుగుతుందన్నారు. సెర్ఫ్ సీఈవో, డిఆర్డీఏ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు 2025-2026 సంవత్సరం నకు ఋణ ప్రణాలిక అంచనా కార్యక్రమాన్ని తయారు చేయడం జరుగుతుందని ఏ పి ఎం తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కె. సత్యా దేవి, కార్యదర్శి పి. సత్యవతి, కోశాధికారి పి. ప్రశాంతి, సి సి వెంకటలక్ష్మి, అకౌంటెంట్ గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.