భారీ అగ్ని ప్రమాదం ఏడుగురు మృతిదురదృష్ట సంఘటన: హోం మంత్రి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రాయవరం అక్టోబర్ 08:

కొమరిపాలెం శివారు వి. సావరం లో శ్రీ గణపతి ఫైర్ వర్క్స్ కేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 7 గురు మృతి చెందడం బాధాకరమని రాష్ట్ర హోంశాఖ మాత్యులు వంగలపూడి అనిత అన్నా రు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బాణసంచా తయారీ కేంద్రానికి వచ్చే ఏడాది వరకు అనుమతి ఉందని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని తెలిపారు.

విద్యుదాఘాతం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు చెప్పడం జరిగిం దన్నారు మృతుల కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు మృతుల కుటుంబాలకు త్వరలో పరిహారం ప్రకటిస్తామన్నారు బాణసంచా తయారీ కేంద్రాలు, దుకాణాలు ముందస్తు జాగ్రత్త నిబం ధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు బాణ సంచా తయారుచేసే కార్మికులకు బీమా కల్పిం చేలా చూస్తామన్నారు

బాణసంచా తయారీ కేంద్రాలు, దుకాణాలు తనిఖీ చేయాలని అధికా రులను ఆదేశించడం జరిగిందన్నారు అయిన ప్పటికీ దురదృష్టవశాత్తు ఇటువంటి సంఘటనలు జరగడం బాధాక రమన్నారు ఆమె తొలుతగా కోనసీమ జిల్లా రాయవరం మండలం కొమరిపాలెం శివారు వి సావరం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన గణపతి గ్రాండ్ ఫైర్‌వర్క్స్ తయారీ కేంద్రం పరిశీలించిన అనిత సహాయ చర్యలు, ఇతర వివరాలు తెలుసుకున్నారు.

బాణా సంచా తయారీ కేంద్రంలో పేలుడు సంఘటన తెలిసిన వెంటనే ఆమె హుటాహుటిన ప్రమాద సంఘటన స్థలాన్ని చేరు కొని సంఘటన కు గల కారణాలను పరిస్థితిని స్థానిక అధికారుల ద్వారా వివరాలు అడిగి తెలుసు కున్నారు లింగం చిన్నబాబు, వాసంశెట్టి విజయలక్ష్మి, చిట్టూరి యామిని అనే క్షతగాత్రు లను కాకినాడ జిజిహెచ్కు మెరుగైన వైద్య సేవల నిమిత్తం తరలించారు. ఉన్న ఆసుపత్రులకు తరలించడం జరిగింది. బాధిత కుటుంబాలకు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె తెలిపారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడం జరిగిందన్నారు. మృతుల కుటుంబాలకు మంత్రి సానుభూతిని తెలిపారు. విద్యుత్ ఘాతంతో జరిగిన ఈ దురదృష్టకర సంఘ టనలో ఆరుగురు కార్మికు లు సజీవ దహనం కావడం బాధాకర మన్నారు. గాయ పడిన వారు త్వరగా కోలు కోవాలని ఆమె భగవంతుని ప్రార్థించారు. బాధిత కుటుం బాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని భరోసాను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండ పేట శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ రాహు ల్ మీనా, ఆర్టీవో దేవరకొండ అఖిల,జిల్లా అగ్నిమాపక విపత్తుల స్పందన శాఖ అధికారి సారథి, డీఎస్పీ మురళీమోహన్ తదిత రులు పాల్గొన్నారు.

Related Articles

Nursing Jobs: నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – జూలై 31: 👉Nursing Posts: నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ. 👉పోస్టులు : నర్సింగ్ ఆఫీసర్ 👉మొత్తం ఖాళీలు : 3500 👉అర్హత: B.Sc […]

తక్షణ సహాయముతో ప్రాణాలను కాపాడిన సి ఐ ప్రశాంత్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం ఫిబ్రవరి 02:సిఐ ప్రశాంత్ కుమార్ తక్షణ ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న ఘటన అమలాపురంలో వైరల్ అవుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా […]

హోం మంత్రి నుంచి అమిత్ షాను తొలగించాలి

అంబేద్కర్ ను అవమానించిన హోం మంత్రి అమిత్ షాను తొలగించాలి రామచంద్రపురం 19 డిసెంబర్ ప్రజా ఆయుధం::ద్రాక్షారామంలో గురువారం దళిత,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అరుణోదయ […]

ప్రతి అక్షరం ప్రజా ఆయుధం

V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా