బహిరంగ ఇసుక రీచ్ లు రేపటినుండే అమ్మకాలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 7:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 20 ఇసుక రీచ్ లలో రుతుప వనాలు సమీపిస్తున్నం దున ఈ నెల ఎనిమిదో తేదీ నుండి బహిరంగ ఇసుక రీచులలో ప్రత్యక్ష విక్రయాలు నిలుపుదల చేసి స్టాక్ యార్డుల ద్వారా విక్రయానికి చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున భవన నిర్మాణ వినియోగదారులు ఈ యొక్క విషయాన్ని గమనించి ఇకపై స్టాక్ యార్డుల ద్వారా ఇసుకను కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు. జిల్లాలో రావులపాలెం గోపాల పురం జొన్నాడ తాతపూడి అమలాపురం ఊబలంక 1,2, వద్దిపర్రు 1,2 రీచులు పొడగట్లపల్లి 1,2, కపిలేశ్వరపురం ఆలమూరు పులిదిండి ఆత్రేయపురం అంకంపా లెం నార్కెడమిల్లి, తదితర రీచులలో ఈ నెల ఎనిమిదో తేదీ నుండి బహిరంగ ప్రత్యక్ష ఇసుక విక్రయాలు నిలుపుదల చేసి స్టాక్ యార్డుల ద్వారా తరలించేందుకు జిల్లా భూగర్భ గనుల శాఖ ఆధ్వర్యంలోచర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.. ఈ 20 బహి రంగ రీచులకు వెళ్లే మార్గాలలో ట్రెంచులు త్రవ్వి నిషేధపు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు

Related Articles

మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు ఆధ్వర్యంలో చలో గుంటూరు మాల

V9 ప్రజా ఆయుధం అన్ లైన్ వార్తలు- మామిడికుదురు డిసెంబర్ 14:చలో గుంటూరు వర్గీకరణ వ్యతిరేక మాల మహానాడు బహిరంగ సభకు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాజీ శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో […]

340 ప్రభుత్వ ఉద్యోగాలు//రేపు ఇంజనీర్ పోస్టులకు అమలాపురంలో రాత పరీక్ష

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 24: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఈనెల 25వ తేదీ మంగళవారం సహాయ పర్యావరణ ఇంజనీర్లు పోస్టుల భర్తీకి కంప్యూటర్ […]

మాజీ మంత్రి రజిని ఆధ్వర్యంలో జగన్ పుట్టిన రోజు వేడుక

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మాజీ మంత్రి విడదల రజిని, ఆధ్వర్యంలో శనివారం కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం అనంతరం […]

జైలు నుంచి లగచర్ల రైతుల విడుదల

తెలంగాణ: లగచర్లలో అధికారులపై దాడి కేసులో అరెస్ట్ అయిన రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. 39 రోజుల తర్వాత 17 మంది రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. గురువారం బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ […]