
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 13 :

పేదోళ్ల ఇంటికి భరోసాగా గృహ నిర్మాణ సంస్థ నిలిచి సొంత ఇంటి కలను సాకారం చేయాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధ్యక్షతన, గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించి గృహ నిర్మాణాల పురోగతు లపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న గృహాలను పూర్తి చేయాలని ఆదేశించారు జిల్లాలో మొత్తం 41,366 గృహాలు మంజూరు కాగా వీటిలో 19,796 గృహాల నిర్మాణాలు పూర్తి కాబ డ్డాయన్నారు. వీటిలో మిగిలిన గృహాలలో ఈ నెలాఖరు నాటికి 1,150 గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశిం చారు. భీమ్ స్థాయిలో ఉన్న 12,571 గృహాల నిర్మా ణాల ను డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాల న్నారు. రాష్ట్రానికి నూతనంగా 3 లక్షల గృహాలు మంజూరు కాగా వీటిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు 9,155 గృహాలను కేటాయించారన్నారు అందు లో ఇప్పటి వరకు 7241 గృహాల నిర్మాణాలు ప్రారం భించబడి గృహ నిర్మాణాల పురోగతిలో కోనసీమ జిల్లా రెండో స్థానం లో నిలిచిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఇండ్లు పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో 3, పట్టణ ప్రాం తాలలో రెండు సెంట్లు భూమిని కేటాయించడం జరుగు తుంద న్నారు. పి ఎం ఏ వై 2.0 కింద బిపిఎల్ కుటుంబాలు ఈ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పూర్వపు లబ్ధి పొంది ఉండకుండా ఉన్న వారు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సొంత ఇంటి స్వప్నాన్ని సాకారం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ పిడి నరసిం హారావు ఈఈ లు, డి ఈ లు ఏఈలు తదిత రులు పాల్గొన్నారు