V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఫిబ్రవరి 20:

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ సేవలపై సంతృప్తి స్థాయిలను పర్యవేక్షించేందుకు వివిధ పథకాల అమలు కార్య క్రమాలు అమలుకు సంబంధించి పారామీటర్లను నిర్దేశించిందని వాటి ద్వారా జిల్లాకు మంచి ర్యాంకింగ్ తీసుకునిరావాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.

గురువారం సాయంత్రం కలెక్టరేట్ నుండి మండల స్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాస్థాయి అధికారులు,ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో ఐవిఆర్ ఎస్ వాట్సాప్, క్యూఆర్ కోడ్ విధానాలు ద్వారా వివిధ సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అమలుకు సంబంధించి ప్రజల నుండి అభిప్రాయాలను ప్రభుత్వం సేకరిస్తుందని ఈ సంతృప్తి స్థాయిల సేకరణలో లబ్ధిదారుల నుండి అసంతృప్తి వెలువెత్తుతున్నట్లు నివేదికల ర్యాంకింగులు స్పష్టం చేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ భరోసా పింఛను దీపం 2 ,ఆసుపత్రి వైద్య సేవలు, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు, అన్న క్యాంటీన్లు రీ సర్వే అంశాలు, బస్సులు బస్టాండ్లలో వసతులు పారిశుధ్య నిర్వహణ వంటి అంశాలపై పూర్తిగా అధ్యయనం చేస్తూ సంతృప్తి స్థాయిలలో రెండు వారాలలో ఆశించిన పురోగతిని సాధించాలని ఆదేశించారు. ప్రభుత్వం డిజిటల్ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పౌరులకు సులభతరంగా వాట్సాప్ ద్వారా ప్రస్తుతం 150 రకాల సర్వీసులను అందిస్తుందని అదేవిధంగా పరిపాలనపరంగా సంతృప్తి స్థాయిలను ఐ వి ఆర్ ఎస్ ద్వారాల బ్ధిదారుల ఫోను చేయడంతో పాటు క్యూఆర్ కోడ్ ద్వారా లబ్ధిదారుల అభిప్రాయాలను సంతృప్తి స్థాయిల ను పర్యవేక్షిస్తుందన్నారు ఈ నేపథ్యంలో లబ్ధిదారుల నుండి అసంతృప్తి వెలువడితోందని నివేది కలు ర్యాంకులు తేట తేల్లం చేస్తున్నాయన్నారు ఇకపై అధికారులు అన్ని అంశాల పట్ల క్షుణ్ణంగా అధ్యయనం చేసి పనితీరును మెరుగు పరుస్తూ ర్యాంకింగులు సాధనకు పాటుపడాలన్నారు.

ర్యాంకింగులు సాధనలో ప్రధాన అడ్డంకులు, కారణాలు ఉంటే తన దృష్టికి తెచ్చి పరిష్కార మార్గాలు కోరాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులు సంతృప్తి ధ్యేయంగా అత్యాధునిక సాంకేతికతను జోడించి అన్ని రకాలుగా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేసిందని ఆ దిశగా అధికార యంత్రాంగం తగిన చొరవ చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి, ఆర్డీవోలు పి శ్రీకర్ దేవరకొండ అఖిల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.