

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం అక్టోబర్ 06:

అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని ప్రధాన పంట కాలువలు మురుగు కాలువలు సరిహద్దుల వెంబడి బ్రిటిష్ కాలంనాటి మ్యాపులు ఆధారంగా సర్వే నిర్వహిం చడానికి చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది: ఎమ్మెల్యే ఆనందరావు

అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు స్ఫూర్తితో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బ్రిటిష్ కాలము నాటి మ్యాపులు సర్వే ప్రమాణాల ప్రకారం పంట కాలువలు డ్రైనేజీలకు సర్ ఆర్థర్ కాటన్ రూపొందించి న సరిహద్దులు ఆధారంగా సర్వే ప్రయోగాత్మకంగా ని ర్వహించి సరిహద్దు రాళ్లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు.

సోమవారం ఈ మేరకు నడిపూడి లాకు వద్ద బ్రిటిష్ కొలమానం ప్రకారం సర్వే నిర్వహించి సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసే ప్రక్రి యకు నాంది పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తం గా ఉన్న డ్రైన్లు పంటకాలు వలు సర్వేను నాలుగైదు నెలల్లో పూర్తి చేసి పూర్తిగా ఆక్రమణలను తొలగిస్తూ సరిహద్దు రాళ్లు ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు.

అలాగే నూతనంగా జిల్లా ఏర్పాటు కావడం, రైతులకు సకాలంలో సాగునీరు అందించడంతోపాటు మురుగునీరు సవ్యంగా పారేలా చర్యలు చేపట్టి పంటలు ముంపుకు గురికాకుండా ఉండేలా అడ్డంకులను తొలగించడం, పెరుగుతున్న జనాభా అవసరాలు కనుగుణంగా ట్రాఫిక్ పూర్తిగా నివారిం చేందుకు గ్రామాలలో వాణిజ్య కూడళ్ళు, రద్దీ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన విగ్రహాలు సర్వే ప్రకారం తొలగిస్తూ పంచాయతీలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సర్వే అనంతరం బ్రిటిష్ సర్వే కొలమానం ప్రకారం 100 మీటర్లకు ఒక సరిహద్దు రాయిని ఏర్పాటు చేసి ఆ స్తంభంపై ఇయర్ మార్క్ పూర్తి వివరాలను రాయించడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఎవరు ఈ సరిహద్దు దాటి ముందుకు రాకూడదని ఆయన హెచ్చరించారు ఆక్రమణలను న్యాయ బద్ధంగా తొలగించేందుకు ఆయా గ్రామాల ప్రజలు పూర్తిగా జిల్లా యంత్రాం గానికి సహకరించాలన్నారు. స్థానిక శాసనసభ్యులు స్ఫూర్తితో సోమవారం నడికుడి లాకు వద్ద బ్రిటిష్ సర్వే ప్రమాణాలకు అనుగుణంగా సర్వే నిర్వహించి తొలుతగా సరిహద్దు రాయి ని స్థాపించడం జరిగిందన్నారు.

తొలుతగా అమలా పురం నియోజకవర్గం లో రెండు నెలల్లో పంట కాలు వలు మురికి కాలు వలు గట్లు సర్వే నిర్వహించడం తదుపరి సరిహద్దు రాళ్లు స్థాపించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ సంబంధించి ఆర్డిఓ నోడల్ అధికారి జాయింట్ కలెక్టర్ నోడల్ అధారిటీ గా వ్యవహ రిస్తారన్నారు. స్థానిక శాసన సభ్యులు ఆనందరావు మాట్లాడుతూ రాష్ట్ర జలవనరుల శాఖ చరిత్రలోనే నిలిచిపోయేలా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాoతి సహకారంతో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని ప్రధాన పంట కాలువలు మురుగు కాలువలు సరిహద్దుల వెంబడి బ్రిటిష్ కాలంనాటి మ్యాపులు ఆధారంగా సర్వే నిర్వహిం చడానికి చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. బ్రిటిష్ కాలం నాటి సర్ ఆర్డర్ కాటన్ ఏర్పాటుచేసిన ఈ వంట కాలువలు డ్రైనేజీ వ్యవస్థ మ్యాప్ ఆధారంగా ఈ సర్వే ను నిర్వహించి పూర్తిగా ఆక్రమణలను తొలగిస్తూ రైతాంగానికి మేలు చేకూర్చే దిశగా ముం దడుగు పడిందన్నారు. కాలానుగుణంగా పెరుగు తున్న అవసరాలకు ఈ సర్వే సరిహద్దు రాళ్లు ఏర్పాటు ప్రక్రియ ఎంతగానో దోహదపడగలదన్నారు. ఎక్కడ స్పష్టమైన రికార్డులు లేకపోవడం తో బ్రిటిష్ కాలం నాటి సర్వే ప్రకారం ఈ ప్రక్రియను అమలు చేస్తున్నామన్నారు. కావున అందరి సహకారంతో ఒక యజ్ఞం మాదిరిగా రైతులు ప్రజలు పూర్తిగా భాగస్వా మ్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. చమురు సహజవాయువు నిక్షేపా లను వెలికితీస్తున్న సంస్థ లకు ఈ సర్వే వల్ల ఆక్రమ ణలు తొలగించబడి సుమారు 50 అడుగులు విస్తరణతో రోడ్లువెడల్పు చేయబడి పటిష్టమైన రహదారులు నిర్మించేం దుకు ఈ సర్వే ఉపకరి స్తుందన్నారు. గ్రామాలకు రోడ్లు విస్తరణ జరుగుతుం దన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి ఆర్డీవో కే మాధవి అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు నాయ కులు మెట్ల రమణబాబు, మార్కెట్ యార్డు చైర్మన్ అధికారి జయలక్ష్మి, తాసిల్దార్ అశోక్ ప్రసాద్ రెవెన్యూ సర్వే సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.