
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఫిబ్రవరి 25:

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం జగ్గారాజు పేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 26 మంది విద్యార్థిని విద్యార్థులు రాగిజావ త్రాగగా వారిలో 14 మంది అస్వస్థతకు గురవడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం భాష తెలిపారు. పాఠశాల కుక్కు కమ్ హెల్పర్ అయిన పులి దిండి సుజాత ఇంట్లో శుభ కార్యం ఉందని మంగళవారం ఉదయమే రాగిజావను ఇంటి వద్ద తయారుచేసి పాఠశా లలకు తరలించడం జరిగిందని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉదయం 10:30 సమ యంలో రాగి జావ విద్యార్థులకు సరఫరా చేయగా వారిలో 14 మంది (6 బాలికలు 8 మంది బాలురు)అస్వస్థతకు గురికాగా వారిని ముందుగా ఉప్పలగుప్తం మండలం ఎస్ యానం ప్రాథమిక ఆరోగ్య కేంద్రా నికి ప్రాథమిక చికిత్స నిమిత్తం తరలించి తదుపరి మెరుగైన వైద్య సేవలు అందించు నిమి త్తం ఉపాధ్యాయులు విద్యా కమిటీ సభ్యులు తల్లిదండ్రులు గ్రామస్తులు అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువె ళ్లారని అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిం చగా ఏడుగురు పరిస్థితి బాగానే ఉందని తిరిగి పంపి వేయడం జరిగిం దన్నారు మరో ఏడుగురు పరిస్థితి కూడా మంగళ వారం సాయంత్రానికి నిలకడగా ఉందని ఆ యన తెలిపారు. రాగి జావా ఫుడ్ పాయిజన్ అయ్యి ఉంటుందని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వారి దృష్టికి సమస్యను తీసుకుని వెళ్ళగా వెంటనే కుక్కు కం హెల్పర్ ను విధుల నుండి తొలగిం చాలని డీఈవో ని ఆదేశించడం జరిగింద న్నారు ఈ మేరకు కుక్కు కం హెల్పర్ ను విధుల నుండి తొలగించడం జరి గిందని డీఈఓ ఆ ప్రకటనలో తెలిపారు.