అమలాపురం ప్రజా వేదికకు 150 అర్జీలుసమస్యలు పరిష్కరించాలి కలెక్టర్ ఆదేశం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం అక్టోబర్ 06:

ప్రజలనుంచి వస్తున్న అర్జీలు పునరావృతం కాకుండా. అధికారులు సత్వరమే పరిష్కరించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం స్థానిక అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్ నందు జిల్లాస్థాయిలో నిర్వ హించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నందు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుని నుండి సుమారుగా 150 అర్జీలను స్వీకరించారు.

అధికారులు తమ పరిధిలో ఉన్న దరఖాస్తులను క్షేత్రస్థా యిలో క్షుణ్ణంగా విచారించి నూటికి నూరు శాతం లబ్ది దారుడిని సంతృప్తి పరుస్తూ సరైన ఎండార్స్మెంట్ తో ఫిర్యాదును ముగించాలన్నారు. ప్రజలు ఇచ్చే ఆర్జీల పట్ల అధికారులు ఆసత్వం ప్రదర్శించకూడదని, సకా లంలో పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ఆర్జీలను కూడా తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.

సమస్యలు పరిష్కరించకపోతే ప్రజల నుంచి అర్జీలు పునరావృ తం అయ్యే అవకాశం ఉందన్నారు.నిబంచనల ప్రకారం అర్జీలు ఉన్నాయో లేదో ముందుగా పరిశీలిం చాలన్నారు. గడువు దాటిన అర్జీలు లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలు చూపాలన్నారు. సుపరిపాలన లో భాగంగా ప్రజలకు చేరువగా ప్రజా సమస్య ల పరిష్కారం కోసం ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధి తో పనిచేస్తుందన్నారు.

ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో నిర్వ హించే వేదికకు అర్జీదారులు రావా లంటే వ్యయ ప్రయాసలకు లోను అవ్వడంతో పాటుగా సమయాన్ని, డబ్బు, వృధా అవుతున్న నేపథ్యంలో సచివాలయ, మండల, డివిజన్ పురపాలక సంఘ స్థాయిల లో ప్రజాశ్రేయస్సు ను కోరుతూ పిజీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు.

మండల డివిజన్ స్థాయిలో పరిష్కా రం కాని సమస్యలను మాత్రమే జిల్లా స్థాయిలో నివేదించాలని ఆయన సూచించారు.

జిల్లా కలెక్టర్ ఇద్దరు వికలాంగులకు సాంకేతిక విద్యాభ్యాసం నిమిత్తం ఉచితం గా లాప్టాప్ లను విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా ఉచితంగా బహుకరించారు. ఈ కార్యక్ర మంలో డిఆర్ఓ కే మాధవి సమగ్ర శిక్ష ఏపీసి జి మమ్మీ డిఆర్డిఏ పి డి గాంధీ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Related Articles

డాక్టర్ కారెం రవితేజకు ఘన సన్మానం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ముమ్మిడివరం ఫిబ్రవరి 07: డాక్టర్ కారెం రవితేజను ముమ్మిడివరంలో ఘనంగా సత్కరించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ […]

క్రీడా వసతులు కల్పన ద్వారా పోలీసులు /రక్షక బటులు/ మానసిక ఒత్తిడిని అధిగమించాలి :జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు వస్తున్నాయి -అమలాపురం జూలై 17: క్రీడా వసతులు కల్పన ద్వారా పోలీసులు (రక్షక బటులు) మానసిక ఒత్తిడిని అధిగమించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ […]

41,366 గృహాలు మంజూరు||గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లను ఆదేశించిన కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 13 : పేదోళ్ల ఇంటికి భరోసాగా గృహ నిర్మాణ సంస్థ నిలిచి సొంత ఇంటి కలను సాకారం చేయాలని డాక్టర్ బి […]

వాటర్ ట్యాంకు. ప్రారంభించిన అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జనవరి 11: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కోడూరుపాడు గ్రామంలో 32 లక్షలు రూపాయలు నిధులతో నిర్మించిన వాటర్ […]