ఏడాదిలోనే ఎంతో చేశాం, చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని కూటమి కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి:మంత్రి డా.డోలా శ్రీ బాల

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీయే కూటమి ప్రభుత్వం సుస్థిర కాలం అధికారంలో ఉండాలి

మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

కోనసీమ జిల్లా రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డా.స్వామి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –రాజోలు, పి.గన్నవరం,జూలై 17:

ఏడాదిలోనే ఎంతో చేశాం, చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని కూటమి కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం నాడు డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరూరు, రాజోలు మరియు పి.గన్నవరం నియోజకవర్గం మెండెపులంకలో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొన్నారు.

ఎంపీ గంటి హరీష్ మాధుర్ , ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు, టీడీపీ నేత నామన రాంబాబు, కూటమి నేతలతో కలిసి మంత్రి స్వామి ఇంటిoటికి వెళ్లి ఏడాదిలో కూటమి పాలన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…ఏడాది పాలనలోనే రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశాం. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని కూటమి కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 2014 -19 లో చేసిన అభివృద్ధి చెప్పుకోలేకనే 2019 ఎన్నికల్లో ఓడిపోయం. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నాం.

ఈ నెలలో అన్నదాత సుఖీభవ ఇస్తాం, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. గత ప్రభుత్వ అప్పులు తీరుస్తూ అభివృద్ధి చేస్తున్నాం. అమరావతి, పోలవరం పూర్తికి సీఎంచంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పి4 తో పేదరికం లేని సమాజమే ద్వేయంగా సీఎం చంద్ర బాబు నాయుడు కృషి చేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీయే ప్రభుత్వం సుస్థిర కాలం అధికారంలో ఉండాలి. కోనసీమ అభివృద్ధి అంతా టిడిపి హయంలోనే జరిగింది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే కూటమిని మళ్లీ అధికారం లోకి తీసుకొస్తాయని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

Related Articles

డాక్టర్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ముమ్మిడివరం/కాట్రేనికోన, మే 27,2025 డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ముఖ్యమంత్రి ఈ నెల మే 31 న రానున్న నేపథ్యంలో […]

రియల్టర్ మద్దాల ఫణి కిరణ్/ మర్యాదపూర్వకంగా కలిసిన జర్నలిస్ట్ వినయ్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి మండలం జూలై 18: V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ – అయినవిల్లి జూలై 18: రియల్ ఎస్టేట్ (రియల్టర్) […]